Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2nd T20I: టీమిండియా విజయ లక్ష్యం 159

India Vs New Zealand, 2nd T20I Live Updates: Colin De Grandhomme Helps New Zealand Reach 158/8

హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియాకు ఆతిథ్య జట్టు 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గత బుధవారం ముగిసిన తొలి టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లు రెండో టీ20లో మాత్రం న్యూజిలాండ్ జట్టుని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు, ఖలీల్ అహ్మద్ రెండు, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. దాంతో 41 పరుగుల వద్ద కివీస్‌ ఓపెనర్లను నష్టపోయింది. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలో డార్లీ మిచెల్‌(1), కేన్‌ విలియమ్సన్‌(20)ఔటయ్యారు.

8 ఓవర్లలో 50 పరుగులకే నాలుగు వికెట్లు

8 ఓవర్లలో 50 పరుగులకే నాలుగు వికెట్లు

దీంతో 8 ఓవర్లలో 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను గ్రాండ్ హోమ్ (50: 28 బంతుల్లో ఫోర్, 4 సిక్సులు), రాస్ టేలర్ (42: 36 బంతుల్లో 3 ఫోర్లు) ఆదుకున్నారు. ముఖ్యంగా గ్రాండ్‌హోమ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 28 బంతుల్లో 50 పరుగులు చేసిన గ్రాండ్‌హోమ్ కివీస్‌కు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు.

చివర్లో రాస్ టేలర్ మెరుపులు

చివర్లో రాస్ టేలర్ మెరుపులు

అతనికి తోడుగా రాస్ టేలర్ (36 బంతుల్లో 42) చక్కని సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రాండ్‌హోమ్‌(50) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత ఇన‍్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను రాస్‌ టేలర్‌ తీసుకున్నాడు. టేలర్‌, సాన్‌ట్నర్‌(7)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరులో వేగం తగ్గింది.

మూడు వికెట్లతో రాణించిన కృనాల్ పాండ్యా

ఆపై టిమ్‌ సౌతీ(3) కూడా నిరాశపరచడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్య‌ (3/28) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్ అహ్మద్ (2/27), భువనేశ్వర్ (1/29), హార్దిక్ పాండ్య (1/36) ఫర్వాలేదనిపించారు. 9.25 ఎకానమీతో 37 పరుగులిచ్చిన చాహల్ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

1
44086
Story first published: Friday, February 8, 2019, 13:48 [IST]
Other articles published on Feb 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+