Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా రికార్డు బద్దలు కొట్టినా సంతోషమే: కోహ్లీ ఫోర్ కోసం దిల్షాన్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మా క్లబ్‌లో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ అన్నాడు. అంతర్జాతీయ టీ20లో 200 ఫోర్లు సాధించడానికి కోహ్లీ ఒక్క ఫోర్ దూరంలో ఉన్నాడు. దీంతో కోహ్లీ బౌండరీ కోసం దిల్షాన్‌ ఆశగా ఎదురుచూస్తున్నాడు.

కోహ్లీ బౌండరీ కోసం దిల్షాన్‌ ఆశగా ఎదురుచూడటం వెనుక ఓ కారణం ఉంది. రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఫోర్ కొడితే 200 ఫోర్లు సాధించిన సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు టీ20ల్లో కేవలం ఇద్దరు మాత్రమే 200 ఫోర్లు రికార్డుని అందుకున్నారు.

 కోహ్లీ మా క్లబ్‌లో రాబోతున్నందుకు సంతోషంగా ఉంది

కోహ్లీ మా క్లబ్‌లో రాబోతున్నందుకు సంతోషంగా ఉంది

అందులో ఒకరు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్(223) కాగా, మరొకరు అఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహ్మద్ షహజాద్(200). ఈ నేపథ్యంలో దిల్షాన్‌ మీడియాతో మాట్లాడాడు. 'కోహ్లీ మా క్లబ్‌లో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత రెండు సంవత్సరాలుగా అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కోహ్లీ నా రికార్డు బద్దలు కొట్టినా సంతోషమే' అని దిల్షాన్ అన్నాడు.

 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కలిసి ఆడాం

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కలిసి ఆడాం

'మేమిద్దరం ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కలిసి ఆడాం. అతను మరో పదేళ్లు క్రికెట్‌ ఆడతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఎన్నో ఫోర్లు, సిక్స్‌లు నమోదు చేస్తాడు. అన్ని విభాగాల్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు నెలకొల్పుతాడు. రికార్డులు అనేవి శాశ్వతం కావు' అని దిల్షాన్‌ తెలిపాడు.

 80 మ్యాచుల్లో 223 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన దిల్షాన్‌

80 మ్యాచుల్లో 223 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన దిల్షాన్‌

2016 సెప్టెంబరు 9న రిటైర్మెంట్‌ ప్రకటించిన దిల్షాన్‌ 80 మ్యాచుల్లో 223 ఫోర్లు, 33 సిక్స్‌లు నమోదు చేశాడు. దిల్షాన్ తర్వాత అఫ్గానిస్థాన్ ఆటగాడు మహమ్మద్‌ షాజాద్‌ మాత్రమే 200 ఫోర్లు సాధించాడు. ఈ ఘనత సాధించేందుకు విరాట్ కోహ్లీ ఒక్క ఫోర్ దూరంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 53 టీ20ల్లో 199 ఫోర్లు బాదాడు.

 తొలి టీ20లోనే రికార్డు నమోదు చేయాల్సి ఉంది

తొలి టీ20లోనే రికార్డు నమోదు చేయాల్సి ఉంది

నిజానికి ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 200 ఫోర్లు మార్కును విరాట్ కోహ్లీ చేరతాడని భావించినా అది జరగలేదు. తొలి టీ20లో 11 బంతులను ఎదుర్కొని కేవలం మూడు సిక్సుల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టక పోవడం విశేషం.

 మూడో టీ20 వర్షం కారణంగా రద్దు

మూడో టీ20 వర్షం కారణంగా రద్దు

న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ నాటికే కోహ్లీ 199 బౌండరీలు సాధించాడు. ఆసీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో 200 ఫోర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లీకి ఆలస్యమైంది.

 11 పరుగుల దూరంలో

11 పరుగుల దూరంలో

ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యధిక పరుగుల్ని సాధించడానికి కోహ్లీ 11 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ టీ 20ల్లో 1878 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ముందు శ్రీలంక క్రికెటర్ దిల్షాన్(1889) ఉండగా, తొలి స్థానంలో బ్రెండన్ మెకల్లమ్(2140) ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+