For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆక్లాండ్‌ వన్డేలో హాఫ్ సెంచరీ.. రాస్ టేలర్‌ సరికొత్త రికార్డు!

India Vs New Zealand 2nd ODI: Ross Taylor most fifty plus scores for new zealand against India

ఆక్లాండ్‌: రెండో వన్డేలో టీమిండియాకు న్యూజిలాండ్‌ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రీ నికోలస్‌ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్‌ టేలర్‌ (73 నాటౌట్‌; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ జులిపించి హాఫ్ సెంచరీతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

భారత్‌పై 11వసారి

భారత్‌పై 11వసారి

హాఫ్ సెంచరీ చేయడంతో టేలర్‌ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై 50కి పైగా స్కోర్లను అత్యధికంగా సాధించిన న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత్‌పై 50కి పైగా స్కోర్లను టేలర్‌ 11వ సారి సాధించాడు. దీంతో నాథన్‌ ఆస్ట్లే రికార్డును అతడు బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో టేలర్‌, ఆస్ట్లే తర్వాత స్థానంలో మాజీ కెప్టెన్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (9), ప్రస్తుత కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (9)లు ఉన్నారు.

మూడో అత్యుత్తమ భాగస్వామ్యం

మూడో అత్యుత్తమ భాగస్వామ్యం

రెండో వన్డేలో కివీస్‌ 273 పరుగులు సాధించగా.. 9వ వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదైందన విషయం తెలిసిందే. టేలర్‌తో కలిసి యువ పేసర్ కైల్‌ జెమీసన్‌ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా కివీస్‌ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా ఈ ఇద్దరు నిలిచారు. ఇక ఆక్లాండ్‌లో 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం కూడా టేలర్‌-జెమీసన్‌లదే కావడం మరో విశేషం.

 గప్టిల్‌ నయా రికార్డు

గప్టిల్‌ నయా రికార్డు

ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ కూడా ఓ నయా రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున సొంత గడ్డపై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును తన పేరుపై లిఖించాడు. ఈ క్రమంలోనే రాస్‌ టేలర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇప్పటివరకూ స్వదేశంలో 92 ఇన్నింగ్స్‌ల్లో గప్టిల్‌ 4,023 పరుగులు సాధించాడు. దాంతో రాస్‌ టేలర్‌ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

సౌతీకే ఆరుసార్లు

సౌతీకే ఆరుసార్లు

ఈ మ్యాచ్‌లో టిమ్‌ సౌతీ వేసిన 10 ఓవర్‌ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సౌతీ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను ఆన్‌సైడ్‌లో ఫ్లిక్‌ చేద్దామని ప్రయత్నించిన కోహ్లీ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్‌ చేసిన జాబితాలో విండీస్ పేసర్ రవి రాంపాల్‌తో కలిసి సౌతీ సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో ఆరు సార్లు సౌతీకే కోహ్లీ ఔట్‌ కాగా.. అంతకుముందు రాంపాల్‌కు కూడా అన్నేసార్లు వికెట్‌ను సమర్పించుకున్నాడు.

Story first published: Saturday, February 8, 2020, 14:41 [IST]
Other articles published on Feb 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+