Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నికోలస్ ఔట్.. గుప్టిల్ హాఫ్ సెంచరీ.. కివీస్ స్కోర్ 133/1

India Vs New Zealand 2nd ODI: Martin Guptill fifty pushes New Zealand ahead

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ అదరగొడుతున్నారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ హాఫ్ సెంచరీ చేసాడు. స్పిన్నర్ యుజువేంద్ర చహల్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. గుప్టిల్ 49 బంతుల్లో 50 పరుగులు చేసాడు.

ఈ మ్యా‌చ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, హెర్నీ నికోలస్ మంచి శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ తొలి వికెట్‌కి 93 పరుగులు జోడించారు. అయితే చాహల్ వేసిన 17వ ఓవర్‌ ఐదో బంతికి హెర్నీ నికోలస్ (41) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.

ఇక ఆ తర్వాతి ఓవర్లో గప్తిల్ అర్ధ సెంచరీ చేసాడు. హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరోవైపు టామ్ బ్లండెల్ కూడా అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 25 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజ్‌లో గుప్టిల్ (71), టామ్ బ్లండెల్ (16) ఉన్నారు.

రెండో వన్డేలో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీలను రెండో వన్డే నుంచి తప్పించి వారి స్థానాల్లో చహల్‌, నవదీప్ సైనీలకు అవకాశం ఇచ్చింది. తొలి వన్డేలో కుల్దీప్‌ రెండు వికెట్లు సాధించినా 10 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఒక వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులిచ్చిన మూడో స్పిన్నర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

భారీగా పరుగులు ఇవ్వడంతో కుల్దీప్‌కు రెండో వన్డేలో ఉద్వాసన తప్పదని ముందే ఊహించారు. అయితే ఇక్కడ ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడం ఏమిటనేదే ప్రశ్న. గత మ్యాచ్‌లో షమీ 9.1 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఒక వికెట్‌ సాధించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కంటే షమీ ప్రదర్శనే మెరుగ్గా ఉంది. శార్దూల్‌ 9 ఓవర్ల బౌలింగ్‌లో వికెట్‌ తీసి 80 పరుగులిచ్చాడు.

Story first published: Saturday, February 8, 2020, 9:28 [IST]
Other articles published on Feb 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+