న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. క్రికెట్‌లో అత్యంత పొడగరి అరంగేంట్రం!!

India Vs New Zealand 2nd ODI: India have won the toss and have opted to field

ఆక్లాండ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ఆక్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ వన్డే కోసం భారత్ ఒక మార్పులతో బరిలోకి దిగుతోంది. సీనియర్ పేసర్ పేసర్ మొహమ్మద్ షమీ స్థానంలో యువ పేసర్ నవదీప్ సైనీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులు చేసింది. మార్క్ చాప్మన్, కైల్‌ జెమీసన్‌ తుది జట్టులోకి వచ్చారు.

తీరికలేని షెడ్యూల్ వల్లే ఫీల్డింగ్‌ తప్పిదాలు ఎక్కువయ్యాయి: టీమిండియా కోచ్తీరికలేని షెడ్యూల్ వల్లే ఫీల్డింగ్‌ తప్పిదాలు ఎక్కువయ్యాయి: టీమిండియా కోచ్

పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన టీమిండియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడి ఒత్తిడిలో పడిపోయింది. సిరీస్‌ నెగ్గాలంటే మిగిలిన రెండు వన్డేలు తప్పక గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తొలి వన్డే జోరు కొనసాగిస్తూ.. సిరీస్‌ చేజిక్కించుకోవాలని కివీస్‌ భావిస్తుంటే.. ఈ మ్యాచ్‌ నెగ్గి సిరీస్‌ సమం చేయాలని విరాట్‌ గ్యాంగ్‌ కృతనిశ్చయంతో ఉంది. టీమిండియా స్వదేశంలో ఆడిన గత రెండు సిరీస్‌ల్లో తొలి మ్యాచ్‌లు ఓడాక.. వరుసగా రెండు వన్డేలు నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకోవడం గమనార్హం.

ఈడెన్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్‌ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టీ20లు ఇక్కడే జరిగాయి. సాయంత్రం మంచు ప్రభావం ఉంటుంది. ఛేదన సులువు కాబట్టి టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ రోజు వర్షం ముప్పు లేదు.

జట్లు:
భారత్: పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ, జస్ప్రీత్‌ బుమ్రా.

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టామ్ బ్లండెల్, రాస్‌ టేలర్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, టిమ్‌ సౌథీ, హమిష్‌ బెన్నెట్‌, మార్క్ చాప్మన్, కైల్‌ జెమీసన్‌.

Story first published: Saturday, February 8, 2020, 7:22 [IST]
Other articles published on Feb 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X