పూణె వన్డే హైలెట్స్: ధావన్‌కి తొలి హాఫ్ సెంచరీ: స్వదేశంలో ధోని క్యాచ్‌ల రికార్డు
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుని భారత బౌలర్లు భువనేశ్వర్ (3/45), జస్ప్రీత్ బుమ్రా (2/38), చాహల్ (2/36), జాదవ్ (0/31) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేయడంతో నిర్ణీతో ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ జట్టులో నికోల్స్ (42), గ్రాండ్‌హోమ్ (41)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. అనంతరం న్యూజిలాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భువీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

మూడు వన్డేల సిరిస్ 1-1తో సమం
ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమమైంది. రెండు జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం. సిరిస్ విజేత ఎవరో తేల్చే మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (7)ను వికెట్‌ను కోల్పోయింది.

వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ధావన్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ధావన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 79 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (29) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి శిఖర్ ధావన్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో ధావన్ వన్డేల్లో 22వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ధోనితో కలిసి భారత్‌కు విజయాన్ని అందించిన కార్తీక్
అనతంరం ధావన్ (68) పరుగులు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యాతో కలిసి దినేశ్ కార్తీక్ వన్డేల్లో 9వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాటిగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా (30) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి దినేశ్ కార్తీక్ భారత్‌కు విజయాన్ని అందించాడు. దినేశ్ కార్తీక్ (64), ధోనీ (18) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

పూణె వన్డే మ్యాచ్ హైలెట్స్:
* భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇది 100వ వన్డే కాగా టీమిండియాకు 50వ విజయం.
* వన్డేల్లో శిఖర్ ధావన్ 22వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. న్యూజిలాండ్‌పై ధావన్‌కి ఇది తొలి హాఫ్ సెంచరీ.
* ఈ మ్యాచ్‌లో ధావన్ తన వన్డే కెరీర్‌లో 50వ సిక్సుని బాదాడు. ఈ ఘనత సాధించిన భారత ఐదో ఓపెనర్.
* ఈ మ్యాచ్‌తో ధావన్ స్వదేశంలో 1000 పరుగులు నమోదు చేశాడు. 25 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. అంతకముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
* దినేశ్ కార్తీక్ తాను ఆడిన 64 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో కార్తీక్‌కి ఇది 9వ హాఫ్ సెంచరీ.
* వన్డేల్లో ధోని 9801 పరుగులు పూర్తి చేశాడు. పదివేల పరుగుల మైలురాయికి ధోనికి ఇంకా 199 పరుగులు అవసరం.
* ఈ మ్యాచ్‌లో మార్టిల్ గుప్టిల్ క్యాచ్‌తో ధోని స్వదేశంలో 200 క్యాచ్‌లను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. భారత్‌లో 223 ఇన్నింగ్స్‌ల్లో 201 క్యాచ్‌లను అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications