Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 1st Test: రెండో రోజు ఆటలో భారీ మార్పులు!

బెంగళూరు వేదికగా జరగాల్సిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా మొదటి రోజు పూర్తిగా రద్దయింది. వర్షం ధాటికి కనీసం టాస్ కూడా పడలేదు. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా బుధవారం నుంచి భారత్ మొదటి టెస్టు ఆడాల్సి ఉంది.

అయితే వర్షం కారంగా మొదటి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకోని పోవడంతో రెండో రోజులో ఆటలో మార్పులు చేశారు. సెషన్ టైమింగ్స్‌ను మార్చారు. 90 ఓవర్లు కంటే ఎక్కువగా ఆట జరిగేలా సెషన్లలో మార్పులు చేశారు. అంతేగా ఇవాళ ఉయదం 8.45కి టాస్ సమయంగా అంపైర్లు నిర్ణయించారు. సాధారణంగా 9 గంటలకు టాస్ వేయాల్సి ఉంటుంది.

India vs New Zealand 1st Test Revised Session Timings Announced for Day 2

ఇక మార్నింగ్ సెషన్‌ను ఉదయం 9.15 నుంచి 11.30 గంటలకు వరకు, ఆ తర్వాత రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12.10 నుంచి 14.25 వరకు నిర్వహించనున్నారు. ఆఖరి సెషన్‌ను మధ్యాహ్నం 2.45 నుంచి 4.45 వరకు నిర్వహించనున్నామని అంపైర్లు ప్రకటించారు. అయితే ఇవాళ ఆటకు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాగా, మ్యాచ్ వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ ఉంది.

జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

Story first published: Thursday, October 17, 2024, 8:08 [IST]
Other articles published on Oct 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+