Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1st T20I: కసిగా బాదారు, భారత విజయ లక్ష్యం 220

India vs New zealand : Team India Target 220 Runs
India vs New Zealand, 1st T20I: Tim Seiferts Maiden Fifty Takes New Zealand To 219/6

హైదరాబాద్: కివీస్ గడ్డపై వన్డే సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకున్న టీమిండియాకు తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 220 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (51/2), కృనాల్ పాండ్య (37/1), చాహల్ (35/1), భువనేశ్వర్ (47/1), ఖలీల్ అహ్మద్ (48/1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదయ్యాయి.

1
44085
ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్‌ను ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు కోలిన్ మున్రో, టిమ్ షైఫెర్ట్ ఆ జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. బ్యాటింగ్ పవర్‌ప్లేలో భారత బౌలర్లకు చుక్కలు చూపించిడంతో పాటు భారీ స్కోర్ సాధించారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఆరు ఓవర్లలో 66 పరుగులు చేశారు.

హాఫ్ సెంచరీ సాధించిన ఓపెనర్ షైఫెర్ట్

హాఫ్ సెంచరీ సాధించిన ఓపెనర్ షైఫెర్ట్

ఆ తర్వాత మరో ఓపెనర్ షైఫెర్ట్ చెలరేగడంతో 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సిక్స్ కోసం ప్రయత్నించిన కొలిన్ మున్రో(34) బౌండరీ లైన్ వద్ద శంకర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

దూకుడుగా ఆడిన కేన్ విలియమ్సన్

దూకుడుగా ఆడిన కేన్ విలియమ్సన్

మున్రో ఔటైన తర్వాత సీఫర్ట్ మరింత దూకుడు పెంచాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3 ఫోర్లు) కూడా బ్యాట్ ఝళిపించడంతో న్యూజిలాండ్‌ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. అయితే, ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 12.4వ బంతికి సీఫెర్ట్‌ ఔట్‌ కావడంతో భారత్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది.

చివర్లో రాస్ టేలర్ మెరుపులు

చివర్లో రాస్ టేలర్ మెరుపులు

జట్టు స్కోరు 164 పరుగుల వద్ద డారెల్‌ మిచెల్‌ (8), విలియమ్సన్‌ వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ (3) నిరాశపరిచినా, చివర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2 సిక్సులు), స్కాట్ (20 నాటౌట్: 7 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) బౌండరీలతో ముగించడంతో భారత్‌కు 220 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

Story first published: Wednesday, February 6, 2019, 14:28 [IST]
Other articles published on Feb 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+