For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో భారత్ విజయం: నెహ్రాకు ఘనమైన వీడ్కోలు

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రారంభమైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో కివీస్‌పై వెక్కిరిస్తున్న చెత్త రికార్డుని భారత్ బుధవారం బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ విజయంతో టీమిండియా పేసర్ ఆశిష్‌ నెహ్రాకు కోహ్లీసేన ఘనంగా వీడ్కోలు పలికింది.

మ్యాచ్ అనంతరం నెహ్రా ఫిరోజ్ షా కోట్లా మైదానం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశాడు. జట్టులోని సహచర ఆటగాళ్లు ఆ సమయంలో నెహ్రా వెంట ఉన్నారు. చివరిగా కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధావన్.... నెహ్రాను ఎత్తుకుని మైదానంలో తిప్పి ఘన వీడ్కోలు పలికారు.

భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

కివీస్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో మూడు టీ20ల ఈ సిరీస్‌‌లో భారత్ 1-0తో ఆధిక్యం‌లో నిలిచింది. 2007 నుంచి ఐదు సార్లు న్యూజిలాండ్‌తో టీ20ల్లో తలపడిన భారత్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేని చెత్త రికార్డుని కూడా కోహ్లీసేన బద్దలు కొట్టింది.

భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (4), మున్రో (7) విఫలమయ్యారు. ఇక, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28), టామ్ లాథమ్ (39) కొద్దిసేపు భారత్ బౌలర్ల‌ని ధాటిగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా, చాహల్ వీరిద్దరినీ అవుట్ చేసేయడంతో కివీస్‌పై ఒత్తిడి పెరిగింది.

దీంతో చివరికి కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, బుమ్రా, పాండ్య తలో వికెట్ తీశారు.


ఫేర్‌వెల్ మ్యాచ్‌‌లో మ్యాజిక్ చేసిన నెహ్రా
తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మ్యాజిక్ చేశాడు. నెహ్రా చేసిన మ్యాజిక్‌ని చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యానికి గురయ్యాడు. జట్టులోని సహచర ఆటగాళ్లు కూడా నెహ్రాని అభినందించారు.

99 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ లక్ష్య చేధనలో తడబడింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 13వ ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. నాలుగో బంతికి టామ్‌ బ్రూస్‌ (10), ఆరో బంతికి కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (0) ఔటయ్యారు. బుమ్రా వేసిన 14.3వ బంతికి పరుగు తీసే ప్రయత్నంలో హెన్రీ నికోల్స్‌ (6) రనౌట్‌ అయ్యాడు. 15 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్ 35, మిచెల్ శాంట్నర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లకు న్యూజిలాండ్ 65/3
భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. తొలి టీ20లో భారత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో లేథమ్‌ (15), బ్రూస్‌ (7) పరుగులతో ఉన్నారు.

18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. యజువేంద్ర చాహల్‌ వేసిన 1.3వ బంతికి గుప్టిల్ (4) అవుటయ్యాడు. లాంగాఫ్‌లో పరుగెత్తుకు వచ్చిన పాండ్య గాల్లోకి అద్భుతంగా డైవ్‌ చేసి బంతిని ఒడిసి పట్టాడు.

ఆ తర్వాత మరో క్యాచ్‌ని పాండ్యా వదిలేశాడు. ఆశిష్‌ నెహ్రా వేసిన 2.5వ బంతిని మన్రో ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని అందుకోవడంలో పాండ్య తడబడ్డాడు. ఆ తర్వాత భువీ వేసిన ఇన్నింగ్స్ 3.4వ బంతికి మన్రో (7)ను అవుటయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 24 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 5, టామ్ లాథమ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కివీస్‌ విజయ లక్ష్యం 203

ఫిరోజ్‌షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చెలరేగి ఆడారు.

ఓపెనర్ శిఖర్ ధావన్ 2 సిక్సులు, 10 ఫోర్లతో 80 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 4 సిక్సులు, 6 ఫోర్లతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 సిక్సులతో 26 పరుగులు చేయగా, ధోనీ (7) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ కు ఓ వికెట్ దక్కింది.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

సిక్సుతో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

ఫిరోజ్‌షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ 14.2వ ఓవర్‌లో సిక్సుతో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాదేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. భారత్‌కు టీ20ల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ రెండు వికెట్లు చేజార్చుకుంది. శిఖర్‌ ధావన్‌ (80) పరుగుల వద్ద అవుటయ్యాడు. సోధి వేసిన 16.2వ బంతికి స్టంపౌట్‌ అయ్యాడు. అదే ఓవర్‌ నాలుగో బంతికి హార్డ్‌ హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (71), కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.

ధావన్ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 39 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 37 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ (40) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 100 పరుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న శిఖర్ ధావన్
ఫిరోజ్‌షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (28) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (16) అతడికి సహకారం అందిస్తున్నాడు. 6 ఓవర్లు (పవర్‌ప్లే) ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.

స్పిన్నర్‌తో తొలి ఓవర్
ఫిరోజ్‌షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పిన్నర్‌ శాంట్నర్‌తో తొలి ఓవర్‌ వేయించాడు. దీంతో భారత్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ 1 పరుగు చేయగా ఒక అదనపు పరుగు వచ్చింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

టాస్‌కు ముందు జట్టు సభ్యులంతా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఆశిష్‌ నెహ్రాకు జ్ఞాపిక అందజేసింది. మ్యాచ్‌లో నెహ్రా ఆడుతున్నాడు.ఈ మ్యాచ్‌తో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

కాగా, న్యూజిలాండ్‌తో ఆడిన ఏ ఒక్క టీ20లోనూ భారత్‌ విజయం సాధించలేదు. 2007 నుంచి చూస్తే కివీస్‌తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఈ టీ20లోగెలిచి ఖాతా తెరవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న ఫిరోజ్ షా కోట్లాలో ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ టీ20లు మాత్రమే జరిగాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత అదే వరల్డ్ కప్‌లో మూడు గ్రూప్ మ్యాచ్‌లతో పాటు ఒక సెమీస్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది.

కాగా, బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20నే ఈ స్టేడియంలో భారత్‌కు తొలి టీ20 కావడం విశేషం. కివీస్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా తన సొంత మైదానంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.

నెహ్రా తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సార్లు గాయాలు పాలయ్యాడు. తన కెరీర్ మొత్తంలో 12 సార్లు సర్జరీలు చేయించుకున్నాడు. 1999లో శ్రీలంకతో టెస్ట్‌ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు.

క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు నెహ్రా ఎదుర్కొన్నాడు. జట్టులో అనేకమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సహచరులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నా.. ఏ మాత్రం నెరవకుండా జాతీయజట్టులో చోటు దక్కించుకుని యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.

India vs New Zealand, 1st T20I: New Zealand win the toss and will bowl

టెస్టులకు 2004లో, వన్డేలకు 2011 వరల్డ్ కప్ తర్వాత, 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైరైన నెహ్రా టీ20ల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. భారత్ తరుపున 26 టీ20లు ఆడి 34వికెట్లు తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో 3/19 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

జట్లు వివరాలు
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, చాహల్

న్యూజిలాండ్: గప్తిల్, మున్రో, విలియమ్సన్, బ్రూసీ, లాథమ్, నికోలస్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, సౌథీ, బౌల్ట్, సోథీ

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+