1st T20I: టాస్ నెగ్గిన రోహిత్, తొలిసారి కలిసి ఆడుతున్న పాండ్యా సోదరులు

హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకున్న భారత్ జట్టు అదే జోరుని టీ20ల్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై వన్డే సిరీస్‌ని చేజార్చుకున్నా.. కనీసం టీ20 సిరీస్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. విజయ్ శంకర్, రిషభ్ పంత్, ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. దీంతో ధోని, కార్తీక్‌తో కలిపి టీమ్‌లో ముగ్గురు వికెట్ కీపర్లకి చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా సోదరులు కలిసి ఆడుతుండటం విశేషం.

తొలి టీ20లో పాండ్యా సోదరులు
దీంతో మోహిందర్ అమరనాథ్, సురీందర్ అమరనాథ్.. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మైదానంలో మెరిశారు. మళ్లీ ఇన్నాళ్లకి హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో ‘సోదరులు' ఈ మ్యాచ్‌లో సందడి చేయనున్నారు.

టీ20ల్లో కివీస్‌దే పైచేయి
అయితే గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌పై కివీస్‌దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్‌ను కూడా గెలవలేదు. 2008-09 పర్యటనలో ధోని సారథ్యంలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో ఓడిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు.

రోహిత్ శర్మ మరో 36 పరుగులు చేస్తే
ఈ టీ20 సిరిస్‌లో రోహిత్ శర్మ మరో 36 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గుప్తిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, వెన్ను గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్.. టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు.

జట్ల వివరాలు
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్
న్యూజిలాండ్ తుది జట్టు: మున్రో, సీఫర్ట్, విలియమ్సన్, రాస్ టేలర్, డార్ల్ మిచెల్, గ్రాండ్‌హోం, శాంట్నర్, కగిలిజీన్, సోధీ, సౌధీ, ఫర్గుసన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications