ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్, విలియమ్సన్, టేలర్.. భారత్ టార్గెట్ 204

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ చెలరేగింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఆకాశమే హద్దుగా విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కోలిన్ మన్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) అర్ధ సెంచరీలు చేయగా.. మార్టిన్ గప్తిల్ (30) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు.

తొలి వికెట్‌కు 80 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు గప్తిల్, మన్రో ధనాధన్ బ్యాటింగ్‌తో మంచి శుభారంభం అందించారు. బౌండరీల మోత మోగిస్తూ.. ఓవర్‌కు పది పరుగులు తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్లు కొడుతూ భారత్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. ఇక మైదానం కూడా చిన్నది కావడంతో సునాయాసంగా బౌండరీలు వచ్చాయి. తొలి వికెట్‌కు ఓపెనింగ్ జోడీ 80 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

మున్రో దూకుడు
భారత ప్రధాన బౌలర్లు ఓపెనింగ్ జోడీని కీలక సమయంలో విడదీయలేకపోయారు. అయితే శివమ్ దూబే బౌలింగ్‌లో గప్తిల్ భారీ షాట్ ఆడగా.. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుత క్యాచ్‌తో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. గప్టిల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. గప్టిల్ పెవిలియన్ చేరినా.. మున్రో దూకుడు మాత్రం తగ్గలేదు. బౌండరీలు కొడుతూ.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు.

విలియమ్సన్, టేలర్ హాఫ్ సెంచరీలు
అయితే ధాటిగా ఆడే క్రమంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మున్రో 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 రన్స్ చేసాడు. ఆ వెంటనే భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ డకౌట్ అయ్యాడు. అయితే రాస్ టేలర్ అండతో విలియమ్సన్ విరుచుకుపడ్డాడు. సిక్సులే లక్ష్యంగా ఆడుతూ.. అర్ధ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో టేలర్ కూడా రెచ్చిపోయి హాఫ్ సెంచరీ చేయడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది.

రోహిత్ అద్భుత క్యాచ్:
తొలి టీ20లో రోహిత్ శర్మ ఓ అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. శివం దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి మార్టిన్ గప్టిల్ డీప్ స్వేర్ లెగ్‌పై భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి బౌండరీ లైన్ తొక్కకుండా క్యాచ్‌ను అందుకున్నాడు. బౌండరీ లైన్ తాకే క్రమంలో బంతిని పట్టుకుని ఒకసారి మైదానంలోకి విసిరేసి మళ్లీ తిరగొచ్చి పట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications