For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కీపర్‌గా రాహుల్.. ఆరుగురు బౌలర్లతో బరిలోకి

India vs New Zealand 1st T20I: India have won the toss and have opted to field

ఆక్లాండ్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో కీపర్‌గా లోకేష్ రాహుల్ కొనసాగుతున్నాడు. దీంతో స్పెషలిస్టు కీపర్‌లు సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ఈ మ్యాచ్ కోసం ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. మరోవైపు కివీస్ జట్టులో కుగ్‌లిన్‌ ఆడట్లేదు.

ఈడెన్‌ పార్క్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇటీవల కివీస్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌లో కూడా భారీగా పరుగులు నమోదయ్యాయి. గత ఏడాది కివీస్‌ పర్యటనలో భారత్‌ వన్డే సిరీస్‌ను 4-1తేడాతో కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కివీస్‌తో భారత్‌ 11 టీ20ల్లో తలపడగా.. కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2019, ఫిబ్రవరిలో హామిల్టన్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ ఏడాదే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో న్యూజిలాండ్‌-భారత్‌ జట్లు ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌నకు ముందు ప్రయోగాలు చేసేందుకు ఈ సిరీస్‌ను వేదికగా చేసుకున్నాయి. అదే విధంగా జట్టులో మేలు మార్పులు కూడా చేసాయి. సొంతగడ్డపై బలమైన జట్టుగా ముద్రపడ్డ న్యూజిలాండ్‌.. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయి ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది. ఈ ఓటమితో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం విజయాలపై నమ్మకంగా ఉన్నాడు.

తుది జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ శార్దూల్‌, యుజువేంద్ర చహల్.

న్యూజిలాండ్‌: కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, సీఫెర్ట్, రాస్‌ టేలర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాన్‌ట్నర్, ఇష్ సోధి, టీమ్ సౌతీ, బెన్నెట్‌, బ్లెయిర్‌ టిక్నెర్‌.

Story first published: Friday, January 24, 2020, 12:17 [IST]
Other articles published on Jan 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+