India vs New Zealand: తొలి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా


హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది.

220 పరుగుల లక్ష్యంతో
220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిన శిఖర్ ధావన్
కానీ కివీస్ బౌలర్ ఫెర్గుసన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్(29) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్ పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన ఆల్ రౌండర్ విజయ్ శంకర్(27) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.
139 పరుగులకే ఆలౌట్
ధోనితో కలిసి దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా(20) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, చివర్లో ధోని(39), భువనేశ్వర్(1), చాహల్(1)లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా 139 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

టాస్ గెలిచిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్‌ను ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు కోలిన్ మున్రో, టిమ్ షైఫెర్ట్ ఆ జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. బ్యాటింగ్ పవర్‌ప్లేలో భారత బౌలర్లకు చుక్కలు చూపించిడంతో పాటు భారీ స్కోర్ సాధించారు. ఆ తర్వాత మరో ఓపెనర్ షైఫెర్ట్ చెలరేగడంతో 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సిక్స్ కోసం ప్రయత్నించిన కొలిన్ మున్రో(34) బౌండరీ లైన్ వద్ద శంకర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

విజృంభించిన కివీస్ ఓపెనర్లు
మున్రో ఔటైన తర్వాత సీఫర్ట్ మరింత దూకుడు పెంచాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3 ఫోర్లు) కూడా బ్యాట్ ఝళిపించడంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. అయితే, ఖలీల్ అహ్మద్ వేసిన 12.4వ బంతికి సీఫెర్ట్ ఔట్ కావడంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. జట్టు స్కోరు 164 పరుగుల వద్ద డారెల్ మిచెల్ (8), విలియమ్సన్ వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ (3) నిరాశపరిచినా, చివర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2 సిక్సులు), స్కాట్ (20 నాటౌట్: 7 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) భారీ స్కోరు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications