T20I హైలెట్స్: ధోని టాప్ స్కోరర్‌గా నిలిచిన ప్రతిసారీ భారత్ ఓటమి


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
భారత్ తరుపున ధోని(39) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ధోని అత్యధిక పరుగులు సాధించిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని అజేయంగా 48 పరుగులతో నౌటాట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆ తర్వాత అదే ఏడాది ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో ధోని 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తాజాగా, బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, టీమిండియా 80 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్‌కు పరుగుల పరంగా భారీ ఓటమి
భారత్ ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ టీ20ల్లో ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల తేడాతో ఓడిన చెత్త రికార్డును నమోదు చేసింది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు ఆ రికార్డుని 80 పరుగులతో ఓడి టీమిండియా అధిగమించింది.
టీ20ల్లో 200
టీ20ల్లో 200కు పైగా పరుగులను భారత జట్టు కేవలం రెండు సార్లు మాత్రమ్ చేధించింది. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 207 పరుగుల లక్ష్యాన్ని చేధించగా... 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.
టీ20ల్లో టీమిండియా ఎక్కువసార్లు ఓడింది కివీస్ చేతిలోనే
టీ20ల్లో టీమిండియా ఎక్కువసార్లు ఓడింది న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చేతిలోనే కావడం విశేషం. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా 7 సార్లు ఓడిపోగా... ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(6 సార్లు) ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications