తొలి టీ20లో మున్రో వీరవిహారం.. భారీ స్కోర్ దిశగా న్యూజిలాండ్

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోలు బౌండరీల మోత మోగిస్తూ.. ఓవర్‌కు పది పరుగులు తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్లు కొడుతూ భారత్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. ఇక మైదానం కూడా చిన్నది కావడంతో సునాయాసంగా బౌండరీలు వచ్చాయి.
గప్టిల్ ధాటిగా ఆడితే.. మున్రో వీరవిహారం చేసాడు. ఇద్దరూ బ్యాట్ జుళిపిస్తూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే గప్టిల్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. గప్టిల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. శివం దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్ డీప్ స్వేర్ లెగ్‌పై భారీ షాట్ కొట్టగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్ అయ్యింది.
గప్టిల్ పెవిలియన్ చేరినా.. మున్రో దూకుడు మాత్రం తగ్గలేదు. బౌండరీలు కొడుతూ.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మున్రో 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 రన్స్ చేసాడు. ఆ వెంటనే భారీ హిట్టర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ డకౌట్ అయ్యాడు. అయితే రాస్ టేలర్ అండతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే 4 సిక్సులు బాదాడు. మరోవైపు టేలర్ కూడా బ్యాట్ జుళిపిస్తున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (31), కేన్ విలియమ్సన్ (39)లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీలింగ్ తీసుకుంది. దాంతో కివీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలి టీ20 మ్యాచ్‌లో కీపర్ బాధ్యతలు లోకేష్ రాహుల్ చేపట్టాడు. దీంతో స్పెషలిస్టు కీపర్‌లు సంజూ శాంసన్, రిషభ్ పంత్‌లకు బెంచ్‌కే పరిమితం అయ్యారు. భారత్ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications