Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీతో చెలరేగిన అయ్యర్.. కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీలు.. న్యూజిలాండ్‌ లక్ష్యం 348!!

India Vs New Zealand 1st ODI : First Innings Highlights | KL Rahul, Shreyas Iyer In Unstopabble Form
India Vs New Zealand 1st ODI: Shreyas Iyer 103, KL Rahul 88 set New Zealand 348 to win

హామిల్టన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సెడాన్ పార్క్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ అదరగొట్టారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు పరుగుల వరద పారించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసి.. కివీస్‌ ముందు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌)తో చెలరేగాడు. ఇది అయ్యర్‌కు తొలి వన్డే సెంచరీ. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్; 64 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీసాడు.

ఆదిలోనే షాక్

ఆదిలోనే షాక్

టాస్ ఓడిన టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా అరంగేట్రం చేసిన పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఫర్వాలేదనిపించారు. 50 పరుగుల భాగస్వామ్యం అనంతరం గ్రాండ్‌హోం ఓవర్‌లో పృథ్వీ షా (20) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్‌ కొట్టి మంచి ఊపుమీదున్న మయాంక్‌ అగర్వాల్‌ (32) కూడా ఔటయ్యాడు. తక్కువ స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది.

కోహ్లీ హాఫ్ సెంచరీ

కోహ్లీ హాఫ్ సెంచరీ

ఓపెనర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌ చేరడంతో విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీ మంచి పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేయడంతో.. స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే కెరీర్‌లో విరాట్‌ 58వ వన్డే హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న విరాట్‌ను సోధీ తన తొలి ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు. సోధీ వేసిన 29వ ఓవర్లో బౌల్డ్‌ అయ్యాడు. అయ్యర్‌తో కలిసి కోహ్లీ 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు.

రాహుల్ సిక్సులు

రాహుల్ సిక్సులు

కోహ్లీ ఔట్ కావడంతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగాడు. రాహుల్ అండతో అయ్యర్ హాఫ్ సెంచరీ చేసాడు. మరోవైపు రాహుల్ కూడా బ్యాట్ జుళిపించాడు. సిక్సులే లక్ష్యంగా ఆడాడు. ఈ జోడి బౌండరీలతో రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క‍్రమంలోనే 40 బంతుల్లో నాలుగు సిక్స్‌లతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రాహుల్‌కిది ఏడో అర్ధశతకం కావడం విశేషం. అకాసేపటికి అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు. ముందుగా 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మరో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు.

జాదవ్ మెరుపులు

జాదవ్ మెరుపులు

సెంచరీ అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో అయ్యర్ (103) క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే రాహుల్‌ ఏమాత్రం తగ్గకుండా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరలో కేదార్ జాదవ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు రాహుల్, జాదవ్ జోడీ 56 పరుగుల భాగస్వామ్యం సాధించింది. కివీస్ బౌలర్లలో సోథీ రెండు వికెట్లు.. గ్రాండ్‌హోమ్, సోదీ చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Wednesday, February 5, 2020, 11:52 [IST]
Other articles published on Feb 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+