Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాస్ టేలర్ సెంచరీ.. విజయానికి చేరువలో కివీస్!!

India vs New Zealand, 1st ODI: Ross Taylor hundred puts New Zealand in sight of win

హమిల్టన్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెడాన్ పార్క్‌లో జరుగుతున్న తొలి వన్డేలో కివీస్ విజయం దిశగా దూసుకెళుతోంది. రాస్ టేలర్ 73 బంతుల్లో అద్భుత సెంచరీ చేయడంతో.. భారత్ నిర్దేశించిన 348 పరుగుల విజయ లక్ష్యంను కివీస్ సునాయాసంగా చెదిస్తోంది. మరోవైపు కెప్టెన్ టామ్ లాథమ్‌ హాఫ్ సెంచరీ (69)తో అదరకొట్టాడు. టేలర్, లాథమ్‌ల జోడి 130పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని విడదీయడానికి అష్టకష్టాలు పడింది.

భారత్ నిర్దేశించిన 348 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్..వికెట్లు కోల్పోకుండా నిదానంగా ఆడింది. తొలుత ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్‌ చక్కని భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. గప్టిల్ 32 పరుగులు చేయగా, 78 పరుగులు చేసిన హెన్రీ నికోలస్ రనౌట్ అయ్యాడు. బుమ్రా వేసిన 29 ఓవర్‌ మూడో బంతికి రాస్‌ టేలర్‌ సింగిల్‌ తీసే యత్నం చేశాడు. దగ్గర్లో పెట్టి పరుగు కోసం నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న నికోలస్‌ పిలుపు అందించాడు. అయితే కవర్స్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి అంతే వేగంగా స్పందించి బంతిపైకి అమాంతం పరుగు తీశాడు. బంతిని పట్టుకున్న మరుక్షణమే బ్యాట్స్‌మన్‌ కంటే వేగంగా పరుగు పెట్టి వికెట్లను గిరటేశాడు.

ఇక క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతున్న రాస్ టేలర్ 45 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు టామ్ లాథమ్ అతడికి చక్కని సహకారం అందించి జట్టును విజయం దిశగా తీసుకెల్లాడు. హాఫ్ సెంచరీ అనంతరం లాథమ్ ఔట్ అయినా. టేలర్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు.

ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసేసరికి కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 34 బంతుల్లో 24 పరుగులు అవసరం. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. క్రీజులో టేలర్ (102), జిమ్మీ నీషం (8)లు ఉన్నారు. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

Story first published: Wednesday, February 5, 2020, 15:34 [IST]
Other articles published on Feb 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+