మరో సిరిస్‌పై కన్నేసిన కోహ్లీసేన: ముంబైలో కివీస్‌తో తొలి వన్డే
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో చేజిక్కించుకున్న టీమిండియా తాజాగా న్యూజిలాండ్‌తో మరో వన్డే సిరిస్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.
ఈ సిరిస్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్లో విజయాలు సాధించి తిరుగులేని రికార్డుతో దూసుకుపోతున్న కోహ్లీసేన మరొ సిరీస్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో విజయం సాధించి సిరిస్‌ను శుభారంభం చేయాలని కోహ్లీసేన భావిస్తోంది.

భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన కివీస్ స్పిన్నర్లు
మరోవైపు న్యూజిలాండ్ కూడా గట్టిగానే వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై కివీస్ బ్యాట్స్‌మెన్లు దృష్టి సారించారు. ఇక, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్‌లతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

గతేడాది 2-3తో ఓటమి పాలైన న్యూజిలాండ్
కెప్టెన్ కేన్ విలియమ్సన్, గప్టిల్, టామ్ లాథమ్, రాస్ టేలర్‌లతో పటిష్టంగానే ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లతో పాటు, స్సిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ ఆ సిరీస్‌ను 2-3తో ఓటమి పాలైంది.

వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు
ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్లీ అదే జట్టుతో భారత పర్యటనకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య 98 వన్డే మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 49 విజయాలు సాధించగా, 43 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇదిలా ఉంటే వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది.

స్వదేశంలో కివీస్‌పై టీమిండియాకు మంచి రికార్డు
వాంఖడెలో టీమిండియా 17 వన్డేలు ఆడగా, 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చివరిసారి ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. కివీస్‌పై భారత్ ఆడిన 23 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, ఏడింట మాత్రమే ఓటమి పాలైంది.

జట్లు అంచనా
టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాథమ్, రాస్ టేలర్, మ్యాట్ హెన్రీ, నికోలస్, కోలిన్ మున్రో, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, మిల్నే, మిచెల్ సంట్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications