Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌ అరంగేట్రం!!

India Vs New Zealand 1st ODI: New Zealand have won the toss and have opted to field


హామిల్టన్‌‌
: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ టామ్‌ లాథమ్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మిచెల్ శాంట్నర్‌, ఇష్‌ సోధీ ఆడుతున్నారు అని లాథమ్‌ తెలిపాడు. మరోవైపు భారత్ తరపున ఓపెనర్లుగా పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్ అరంగేట్రం చేస్తున్నారు. కేదార్ జాదవ్ కూడా తొలి వన్డేలో చోటు దక్కించుకున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లీసేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా.. అటు న్యూజిలాండ్‌ టీ20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. భారత్‌ సొంతగడ్డపై ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించగా.. న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం తర్వాత ఇదే తొలి వన్డే కావడం విశేషం. హామిల్టన్‌‌లో మూడో టీ20కి వాడిన పిచ్‌నే మళ్లీ ఉపయోగించనున్నారు. వికెట్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలం కాదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టమే. వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌ గాయాలతో సతమతమవుతోంది. టీ 20ల్లో ఆడని బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ ఇప్పటికీ కోలుకోకపోగా.. కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ కూడా గాయంతో తొలి రెండు వన్డేల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో లాథమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీతో పాటు విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సేవలు కోల్పోవడం జట్టుకు పెద్ద లోటు. అయితే లాథమ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం చెప్పుకోదగ్గ అంశం.

తొలి వన్డే సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదు అయింది. భారత్‌ తరఫున ఇద్దరూ ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఒకేసారి వన్డేల్లో అరంగేట్రం చేసారు. ఇలా ఇద్దరు ఓపెనర్లు ఒకేసారి అరంగేట్రం చేయడం భారత క్రికెట్‌లో ఇది నాలుగోసారి. 2016లో జింబాబ్వేపై కేఎల్‌ రాహుల్‌-కరుణ్‌ నాయర్‌, 1974లో ఇంగ్లండ్‌పై సునీల్‌ గవాస్కర్‌-సుధీర్‌ నాయక్‌, 1976లో న్యూజిలాండ్‌పై వెంగ్‌సర్కార్‌-పార్థసారథి శర్మ ఒకేసారి ఓపెనర్లుగా అరంగేట్రం చేశారు.

జట్లు:
భారత్: పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా.

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టామ్ బ్లండెల్, రాస్‌ టేలర్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్ శాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, హమిష్‌ బెన్నెట్‌.

Story first published: Wednesday, February 5, 2020, 7:24 [IST]
Other articles published on Feb 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+