For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన కోహ్లీ: భారత్‌పై కివీస్ ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్ల

By Nageshwara Rao

హైదరాబాద్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది.

281 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించడం విశేషం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) పరుగులతో రాణించారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. చివర్లో ఒక్క పరుగు అవసరమైన సమయంలో రాస్ టేలర్ అవుట్ కావడంతో క్రీజులోకొచ్చిన నికోల్స్ ఫోర్‌తో కివీస్‌కు విజయాన్నందించాడు.

భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, కుల్దీప్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న కోహ్లీ సేన కివీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌ను మాత్రం ఓటమితో ఆరంభించింది. అంతకముందు టాస్ గెలిచిన కోహ్లీసేన తొలుత బ్యాటింగ్ చేసి 280 పరుగులు చేసింది.


న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాగిందిలా:

నిలకడగా లక్ష్యం ఛేదిస్తున్న కివీస్‌: 30 ఓవర్లకు 80/3

281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ నిలకడగా ఛేదిస్తోంది. 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 120 బంతుల్లో 133 పరుగులు చేయాలి. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ టామ్ లాథమ్‌తో కలిసి రాస్ టేలర్ నెమ్మదిగా ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి 76 బంతుల్లో 68 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. లాథమ్ 37, రాస్ టేలర్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ విజయానికి 133 పరుగులు కావాలి.

మూడో వికెట్ కోల్పోయిన కివీస్
281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 80 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్టిల్‌(32) హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి కివీస్ మూడు వికెట్ల కోల్పోయి 83 పరుగులు చేసింది.

మున్రో అవుట్
ముంబై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మున్రో (28) దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. గుప్టిల్ (21), కేన్ విలియమ్సన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.


న్యూజిలాండ్ విజయ లక్ష్యం 281
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్కు 281 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు చేసిన భారత్ ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

16 పరుగుల వద్ద ఓపెన్ శిఖర్ ధావన్(9) వికెట్‌ను కోల్పోయిన భారత్, 29 పరుగుల వద్ద రోహిత్ శర్మ (20), 71 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (12) వికెట్లను కోల్పోయింది. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ... దినేశ్ కార్తీక్ (37)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Virat Kohli

ఈ క్రమంలో తన కెరీర్‌లో 31వ సెంచరీ నమోదు చేసి విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో సచిన్ (49) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర అరుదైన గుర్తింపు పొందాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని (25), హార్ధిక్ పాండ్యా (16), భువనేశ్వర్ కుమార్ (26) పరుగులు చేశారు.

చివరకు విరాట్ కోహ్లీ 125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీసుకోగా, టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ తీసుకున్నాడు.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

సచిన్ తర్వాత కోహ్లీనే: వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడు

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో తన కెరీర్‌లో కోహ్లీ 31వ సెంచరీ నమోదు చేసి ప్రపంచంలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా అరుదైన రికార్డు తన పేరిట లిఖించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 31 సెంచరీలతో కోహ్లీ రెండో స్ధానంలో నిలిచాడు.

కోహ్లీ 200వ వన్డేలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 111 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 30 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తర్వాత.. 200వ వన్డేలో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.

ధోని అవుట్: ఐదో వికెట్ కోల్పోయిన భారత్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 41 ఓవర్ చివరిలో ధోనీ (25) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి ధోని అవుటయ్యాడు. ధోని అవుటైన తర్వాత కోహ్లీకి జతగా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దీంతో 41 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. కోహ్లీ 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 144 పరుగుల వద్ద దినేశ్ కార్తీక్.. సౌథీ బౌలింగ్‌లో మున్రోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దినేశ్ కార్తీక్ అవుటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ (59), ధోని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

వన్డేల్లో 46వ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సుతో 52 పరుగులు చేసిన కోహ్లీ తన కెరీర్‌లో 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు క్రీజులో దినేశ్ కార్తీక్ ఆచితూచి ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి 64 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కోహ్లీ(53), కార్తీక్ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు.

20 ఓవర్లకు టీమిండియా 93/3
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), శిఖర్ ధావన్‌(9), కేదార్ జాదవ్‌(12)లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి కెప్టెన్ కోహ్లీ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీసుకోగా, శాంట్నర్ ఒక వికెట్ తీసుకున్నాడు

జాదవ్ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (12) పరుగుల వద్ద అవుటయ్యాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జాదవ్ అవుటైన తర్వాత దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. దీంతో టీమిండియా 16 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (26), దినేశ్ కార్తీక్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ (5), కేదార్‌ జాదవ్‌ (3) ఆచితూచి ఆడుతున్నారు.

29 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద రోహిత్ శర్మ (20) అవుటయ్యాడు. బౌల్డ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌల్డయ్యాడు. ఐదు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం టీమిండియా ఆరు ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ప్రస్తుతం కేదార్ జాదవ్ (12), విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

Rohit Sharma

ధావన్ అవుట్: తొలి వికెట్ కోల్పోయిన భారత్

వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (9) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్‌లో లాథమ్‌కు కీపర్ క్యాచ్ ఇచ్చి ధావన్ పెవిలియన్ బాట పట్టాడు. ధావన్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్లో విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన మరొక సిరీస్‌పై కన్నేసింది.

ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డే విరాట్ కోహ్లీకి 200వ వన్డే. తద్వారా ఈ ఘనత సాధించబోతున్న 13వ భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంగా చూస్తే రెండోందల వన్డే ఆడుతున్న 72వ క్రికెటర్.

India vs New Zealand, 1st ODI, Mumbai, live cricket score: IND bat on Virat Kohli's 200th ODI

ఇప్పటి వరకూ 199 వన్డేలు ఆడిన కోహ్లీ 8, 767 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 55.13 ఉండగా, స్ట్రైక్ రేట్ 91.47గా ఉంది. ఇక, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే మాత్రం పాంటింగ్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 98 వన్డే మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 49 విజయాలు సాధించగా, 43 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ఒక మ్యాచ్ టై కాగా, మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక, వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వాంఖడెలో టీమిండియా 17 వన్డేలు ఆడగా, 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చివరిసారి ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

జట్ల వివరాలు:
టీమిండియా:
శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, కేదార్‌ జాదవ్‌, ధోనీ, హర్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌

న్యూజిలాండ్:
మార్టిన్‌ గుప్తిల్‌, కాలిన్‌ మున్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌, కాలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, ఆడమ్‌ మిల్నే, టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+