ధర్మశాల: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ అజేయంగా 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కివీస్‌ను 190 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 101 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0 తేడాతో ముందు నిలిచింది.
1st ODI: భారత్ Vs న్యూజిలాండ్ స్కోరు కార్డు
21 పరుగుల వద్ద కెప్టెన్ ధోని ఔట్
ధర్మశాల వన్డేలో భారత్ విజయం దాదాపు ఖయమైపోయింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి టీమిండియా 28.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. జట్టుని గెలుపు దిశగా నడిపిస్తున్న క్రమంలో ధోనీ రనౌట్ గా వెనుదిరిగాడు. షాట్ కొట్టిన ధోనీ రన్ కోసం ప్రయత్నించగా ముందుకు వచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో వికెట్ కీపర్ రోంచి స్టంపౌట్ చేశాడు. కాగా అకారణంగా ధోనిని రనౌట్ చేసినందుకు గాను కోహ్లీ బ్యాట్‌ను పట్టుకుని తల కిందకు వంచుకుని చాలా బాధపడుతున్నట్టు కనిపించాడు. బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు.
కోహ్లీ అర్ధ సెంచరీ
ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. 55 బంతుల్లో ఐదు ఫోర్లతో అర్ధసెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ అర్ధసెంచరీ. 27.3 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. విజయానికి భారత్ 22.3 ఓవర్లలో ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 60, ధోని 20 పరుగులతో ఉన్నారు.
పాండే ఔట్: క్రీజులో ధోని, కోహ్లీ
ధర్మశాల వన్డేలో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళుతోంది. టీమిండియా ప్రస్తుతం 21 ఓవర్లకు 118 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(14), రహానే(33), మనీష్ పాండే(17) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. భారత్ గెలవడానికి ఇంకా 28.4 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కోహ్లీ(25), ధోనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచే రహానే దూకుడుగా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ శర్మ 14 పరుగుల వద్ద ఔటైనప్పటికీ భారత్‌కి 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం లభించింది. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో రహానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటవగా భారత్ స్కోరు 69 వద్ద పరుగుల వద్ద రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి (16), మనీశ్ షాండే (5)ఉన్నారు. విజయానికి భారత్ 35 ఓవర్లలో ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది.
12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 62/1
పదో ఓవర్ ముగిసేసరికి 49 పరుగులు చేసిన టీమిండియా 11వ ఓవర్ ప్రారంభమయ్యే సరికి 56 పరుగులెలా అయ్యాయి. 11వ ఓవర్ వేసిన నీషమ్ తొలి బంతిని వైడ్‌గా సంధించాడు. దాని కీపర్ అందుకోలేకపోవడంతో దీంతో వైడ్‌తో పాటు 4 పరుగులు వచ్చాయి. అనంతరం రెండు వరుస బంతులను కూడా వైడ్‌గా సంధించాడు. దీంతో 11వ ఓవర్ తొలి బంతి కౌంట్‌లోకి వచ్చేసరికే స్కోరు బోర్డులో అదనంగా ఏడు పరుగులు వచ్చి చేరాయి. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. రహానే (33), కోహ్లీ (5) క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 49/1
ఓపెనర్ రోహిత్ శర్మ (14) ఆచితూచి ఆడుతుండగా, అజింక్యా రహానే (33) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండో ఓవర్ లో బ్యాటు విరిగిపోవడంతో ఒక ఓవర్ నెమ్మదించిన రహానే తరువాత స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. పదో ఓవర్‌లో అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
విరిగిన రహానె బ్యాట్
భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 191 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఆకట్టుకున్నారు. కివీస్ పేసర్ బ్రాస్‌వెల్ వేసిన ఓవర్‌లోని నాలుగో బంతిని ఎదుర్కునే క్రమంలో రహానే బ్యాట్ అంచు విరిగిపోయింది.
న్యూజిలాండ్ 190 ఆలౌట్
భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 43.5 ఓవర్లలో న్యూజిలాండ్ 190 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఓపెనర్ లాథమ్ (79 నాటౌట్), టిమ్ సౌథీ (55)లు మాత్రమే రాణంచగా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
9 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను తన మెరుపు ఇన్నింగ్స్‌తో టిమ్ సౌథీ ఆదుకున్నాడు. దీంతో 42 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 179 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ లాంతమ్ 79 పరుగులతో జట్టు స్కోరుని లాక్కొస్తున్నాడు. కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ ను తన మెరుపు ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు పేస్ బౌలర్ టిమ్ సౌథీ. పదో నంబర్లో బ్యాటింగ్ కు దిగిన సౌథీ.. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఒక దశలో 8 వికెట్లకు 106 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్.. తమ పరువు కాపాడుకుంది.
న్యూజిలాండ్ జట్టుకు భారత పర్యటన అస్సలు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. వన్డే సిరిస్‌లో రాణించే అత్యంత అద్భుతమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతమైనప్పటికీ ఆ మేరకు రాణించడం లేదు. నిజానికి ప్రత్యర్ధి జట్టుని మట్టికరిపించడంలో కివీస్ ఆటగాళ్లను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు.
అలాంటి కివీస్ జట్టుకు భారత్‌తో సిరీస్ కలసిరాలేదు. టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవ్వడంతో ఆజట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన కివీస్ జట్టు ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో పేలవమైన ఆటతీరుని కనబరుస్తుంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
న్యూజిలాండ్ 107/8
తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. కలిసికట్టుగా కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. పేసర్లు హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్‌లకు తోడు స్పిన్నర్లు కేదార్ జాదవ్, మిశ్రా చెలరేగడంతో కివీస్ 107 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనీయకుండానే వరుసగా పెవిలియన్‌కు చేర్చారు. వరుసగా వికెట్లు తీస్తూ కివీస్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం క్రీజులో లాంథమ్ 55, టిమ్ సౌథీ 3 పరుగులతో ఉన్నారు.
82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 82/7 (25.1 ఓవర్లు)
82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. గుప్టిల్ (12), విలియమ్సన్ (3), టేలర్ (0), ఆండర్సన్ (4), రోంచి(0), నీషమ్ (10), సాంట్నర్ (0) పెవిలియన్ చేరారు. భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నారు. తొలి వన్డే ఆడుతున్న పాండ్యా మూడు వికెట్లు తీసుకోగా, ఉమేష్, కేదార్ జాదవ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
న్యూజిలాండ్ 66/7 (18.5 ఓవర్లు)
ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 66 పరుగులకే న్యూజిలాండ్ 7 వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ చూస్తుంటే పెవీలియన్ కు చేరేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు పోటీ పడుతున్నారా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంటే, ఫోర్ల మీద ఫోర్లు కొడుతున్నా, కివీస్ న్యూజిలాండ్ వికెట్లను కోల్పోతుంది.
అద్భుత క్యాచ్ ను అందుకున్న ఉమేష్ యాదవ్
ఉమేష్ యాదవ్ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన 10 ఓవర్‌లో నాలుగో బంతిని కోరీ అండర్సన్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేష్ ఎవరూ ఊహించని విధంగా డైవ్ కొట్టి ఆ బంతిని క్యాచ్ రూపంలో అందుకున్నాడు. ఉమేష్ ఆ తరహా క్యాచ్ అందుకోవడంతో జట్టులోని సభ్యులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కాగా పేసర్ల ధాటికి విలవిల్లాడుతున్న న్యూజిలాండ్ 14.0 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఈ 5 వికెట్లలో పాండ్యా మూడు వికెట్లు తీసుకోగా, యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్ 48/5 (12.1 ఓవర్లు)
తొలి వన్డేలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ధర్మశాలలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గుప్టిల్ (12), విలియమ్సన్ (3), టేలర్ (0), ఆండర్సన్ (4), రోంచి(0) పెవిలియన్ చేరారు.
నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 43/4 (10.4 ఓవర్లు)
తొలి వన్డేలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి వన్డేలో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నాడు. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్‌లో ఆండర్సన్‌ను పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా బౌలర్లలో పాండ్యా, యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ధోనీ నమ్మకాన్ని నిలబెడుతూ బంతి అందుకున్న పాండ్యా 11వ ఓవర్‌లో నాలుగో బంతికి కివీస్ విధ్వంసకర ఆటగాడు కోరే ఆండర్సన్ (4)ను ఔట్ చేశాడు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 41/3 (9.0 ఓవర్లు)
తొలి వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 33 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, హార్దిక్ సత్తా చాటుతున్నారు. యాదవ్ బౌలింగ్ టేలర్ ధోనికి క్యాచ్ ఇవ్వడంతో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. పాండ్యా వేసిన రెండో ఓవర్లో గుప్టిల్ 12 పరుగుల వద్ద ఔటవ్వగా, ఐదో ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ దారి పట్టాడు. ఉమేష్ యాదవ్ తో కలిసి కొత్త బంతి పంచుకున్న హార్డిక్ పాండ్య రెండు వికెట్ల తీసి ఆకట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ఐదు ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ 27/1 (4.1 ఓవర్లు)
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డే రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ వన్డేతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్ 12 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. కాగా, ఇదే ఓవర్లో గుప్టిల్ మూడు ఫోర్లు కొట్టాడు. చివరి బంతికి పెవిలియన్‌కు చేరాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ధోని మాట్లాడారు. రాత్రిపూట మంచు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్య వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
తొలి వన్డేకు సురేష్ రైనా ఎంపికైనా వైరల్ ఫీవర్ కారణంగా దూరం కావడంతో హార్దిక్ పాండ్యను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీ 20ల్లో ఆడిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యకు ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీలకు విశ్రాంతినిచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా తొలి వన్డేలో భాగంగా తుది జట్టులో మణ్‌దీప్‌సింగ్, జయంత్‌యాదవ్, ధవల్ కులకర్ణిలకు చోటు దక్కలేదు. ఇద్దరు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ జట్టులో చోటు కల్పించారు. ఇక పేస్ బౌలింగ్‌ను బుమ్రా, ఉమేష్ యాదవ్ వేయనున్నారు. ఇటీవల ముగిసిన టెస్టు క్రికెట్‌ని దృష్టిలో ఉంచుకునే కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు.
ఇటీవల ముగిసిన టెస్టుల్లో న్యూజిలాండ్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తాజాగా వన్డేలపై దృష్టిసారించింది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో ధోనిసేన భావిస్తుండగా, టెస్టుల్లో ఎదురైనా ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ ఉంది.
భారత్‌లో ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా నెగ్గని కివీస్
ఇరుజట్ల మధ్య నాలుగు దశాబ్దాలుగా వన్డే సిరిస్ జరుగుతుంది. క్రికెట్ చరిత్రలో భారత్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా గెలువకపోవడం విశేషం. న్యూజిలాండ్ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు వచ్చినా, ఎన్నో చరిత్రాత్మక విజయాలు సాధించినా ఇందులో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ లోటుని పూరించే అవకాశం విలియంసన్ సేనకు అవకాశం వచ్చింది.

భారత్‌కు ఇది 900వ వన్డే మ్యాచ్
భారత్‌కు ఇది 900వ వన్డే. దీంతో గెలుపే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 4-1తో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ (113), భారత్ (110) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నాయి.
న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి
భారత్‌లో జరిగిన ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కు 18-11తో మెరుగైన రికార్డు ఉంది. కానీ, మన దేశంలో ఆ జట్టు ఇప్పటిదాకా ఒక్క వన్డే సిరీస్‌ను కూడా నెగ్గలేదు. 1988, 1995, 1999, 2010 సంవత్సరాల్లో ఇరు జట్ల మధ్య నాలుగు సిరీస్‌లు జరిగాయి. అన్నింటిలోనూ భారత్‌దే విజయం. పైగా, చివరి సిరిస్‌లో ఐదు మ్యాచ్‌లూ నెగ్గిన టీమిండియా కివీస్‌ను వైట్‌వాష్ చేసింది.
జట్లు:
భారత్: ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ