న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand, 1st ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

India vs New Zealand, 1st ODI, Live Cricket Score and updates: New Zealand bat, India drop Karthik, Jadeja

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై చారిత్రక విజయాలు సాధించిన కోహ్లీసేన మరో కీలక సమరానికి సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా తొలి వన్డే బుధవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ స్పిన్నర్ సాంటర్న్‌తో పాటు ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా ఆడిన ఆఖరి వన్డే జట్టులో కెప్టెన్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసి వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్నాడు.

1
44080

ఉత్సాహంలో భారత్‌

ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో మట్టికరిపించిన ఉత్సాహంలో భారత్‌ ఉండగా సొంతగడ్డపై ఆడుతున్న సానుకూలత న్యూజిలాండ్‌కు కలసిరానుంది. కివీస్‌కు సొంత గడ్డపై మంచి రికార్డు ఉంది. దానికి తోడు ఆ జట్టు ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతుంది.

బౌలర్లతో సమతూకంగా కివీస్

బలమైన బ్యాటింగ్ లైనప్‌నకు తోడు, ప్రపంచ స్థాయి బౌలర్లతో కివీస్ సమతూకంగా ఉంది. గతంలో భారత్ ఇక్కడ 35 వన్డేలు ఆడి, 10 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాయాలని భావిస్తోంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ ఐదు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకిదే చివరి విదేశీ పర్యటన కావడంతో కివీస్‌పై సిరీస్ గెలవాలని టీమిండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, ధోనీ, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, షమీ

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, సాంటర్న్, బ్రాస్‌వెల్, టిమ్ సౌథీ, ఫర్గుసన్, ట్రెంట్ బౌల్ట్

Story first published: Wednesday, January 23, 2019, 8:20 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X