కోహ్లీ ఔట్.. అయ్యర్ హాఫ్ సెంచరీ.. రాహుల్ సిక్సులు!!

హామిల్టన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నాడు. అయితే.. హాఫ్ సెంచరీ చేశాడని ఆనందించే లోపే స్పిన్నర్ ఇష్ సోధీ బౌలింగ్‌లో కోహ్లీ 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఆదిలోనే షాక్:
టాస్ ఓడిన టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా అరంగేట్రం చేసిన పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఫర్వాలేదనిపించారు. 50 పరుగుల భాగస్వామ్యం అనంతరం గ్రాండ్‌హోం ఓవర్‌లో పృథ్వీ షా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్ కొట్టి మంచి ఊపుమీదున్న మయాంక్ అగర్వాల్ కూడా ఔటయ్యాడు. తక్కువ స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది.

కోహ్లీ హాఫ్ సెంచరీ:
ఓపెనర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీ మంచి పార్ట్‌నర్‌షిప్ నమోదు చేయడంతో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే కెరీర్‌లో విరాట్ 58వ వన్డే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న విరాట్‌ను సోధీ తన తొలి ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు. సోధీ వేసిన 29వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విరాట్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు.

రాహుల్ సిక్సులు:
కోహ్లీ ఔట్ కావడంతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగాడు. రాహుల్ అండతో అయ్యర్ హాఫ్ సెంచరీ చేసాడు. మరోవైపు రాహుల్ కూడా బ్యాట్ జుళిపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సిక్సులు బాదాడు. ఈ జోడి బౌండరీలతో రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. టీమిండియా 38 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ (42), అయ్యర్ (69)లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications