For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ పర్యటనలో భారత్ బోణీ: తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం

India vs New Zealand, 1st ODI: India Beat New Zealand By 8 Wickets, Take 1-0 Series Lead

హైదరాబాద్: ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీసేన న్యూజిలాండ్‌ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బోణీ కొట్టింది. తొలి వన్డేలో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది.

1
44080

158 పరుగుల లక్ష్యంతో

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నమోదైన అనంతరం రోహిత్‌ శర్మ(11) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో శిఖర్ ధావన్‌ దూకుడుగా ఆడాడు. భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు.

సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిపివేత

సూర్యుడి కిరణాలు సరిగ్గా బ్యాట్స్‌మన్ కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి. సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేస్తున్న శిఖ‌ర్ ధావ‌న్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ధావన్ హాఫ్ సెంచరీ

మ్యాచ్‌ పునఃప్రారంభమైన తర్వాత శిఖర్ ధావన్‌ విజృంభించాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. కివీస్‌ బౌలర్లతో ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 69 బంతుల్లో కెరీర్‌లో 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు కోహ్లీ(45) కూడా హాఫ్‌ సెంచరీకి చేరువగా వచ్చి కివీస్ పేసర్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

అయితే అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్(75) మిగతా పనిని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో భారత్‌ 85 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

1-0 ఆధిక్యంలో టీమిండియా

దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్(4/39), షమీ(3/19), చాహల్(2/43) సత్తాచాటడంతో న్యూజిలాండ్ 157 పరుగులకే కుప్పకూలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(64) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఫరవాలేదనిపించాడు. సొంత గడ్డపై అద్భుతమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు.

Story first published: Wednesday, January 23, 2019, 15:01 [IST]
Other articles published on Jan 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+