వర్షం ముప్పు పొంచి ఉండడంతోనే..
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలర్లకు ప్రాక్టీస్ అవసరమని భావించినట్లున్నాడు. అందుకే ఇంకా క్రీజులో కేఎస్ భరత్ లాంటి స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నప్పటికీ డిక్లేర్ ఇచ్చేశాడు. ఇక బౌలింగ్ దిగిన టీమిండియా బౌలర్లు.. పటిష్ఠంగా బౌలింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా షమీ నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. కౌంటీ క్లబ్ జట్టుకు తన పవరేంటో చూపిస్తున్నాడు. ఇకా ఆ జట్టు స్కోరు 13.1ఓవర్లకు 3వికెట్లు కోల్పోయి 44కు చేరుకుంది. ఇక ఈ మూడు వికెట్లలో షమీ రెండు పడగొట్టగా.. సిరాజ్ ఒకటి పడగొట్టాడు.
షమీని ఎదుర్కోలేకపోయిన పుజారా
లీసెస్టర్ షైర్ జట్టు నుంచి ఓపెనర్లుగా లూయిస్ కింబర్, సామ్యూల్ ఈవాన్స్ బరిలోకి దిగారు. ఇక భారత జట్టు తరఫున తొలి స్పెల్లో మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ బౌలింగ్ వేశారు. వీరిద్దరి బౌలింగ్‌కు లీసెస్టర్ షైర్ జట్టు ఓపెనర్లు బాగా తడబడ్డారు. ఇక 7వ ఓవర్ రెండో బంతికి షమీ.. కెప్టెన్ సామ్యూల్ ఈవాన్స్ (1పరుగు 22బంతుల్లో)ను స్లిప్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి భారత నయా వాల్ పుజారా బరిలోకి దిగారు. ఇక పుజారా షమీని ఎదుర్కోలేకపోయాడు. 9వ ఓవర్ రెండో బంతికి షమీ బౌలింగ్లో పుజారా కట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు చేయకుండానే పుజారా డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
పుజారాను ఔట్ చేసిన ఆనందంలో షమీ..
ఇక పుజారా ఔటయ్యాక షమీ భలే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఓ వైపు ఔటయి తన మానాన తను పుజారా పెవిలియన్ వైపు వెళ్లిపోతుంటే.. షమీ పరిగెత్తుకుంటూ వచ్చి గెంతి అతనితోనే సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇక పుజారా సైతం మౌనంగా డ్రెస్సింగ్ రూం దిక్కు వెళ్లిపోయాడు. ఇక పుజారా, షమీ ఎదురుపడడం భలే ఆసక్తికరంగా అనిపించింది. వీరిద్దరి పోరులో షమీదే పైచేయి అయింది. ఇక షమీ సెలబ్రేషన్లు నెట్టింటా వైరలవుతున్నాయి. కొందరు షమీ చాలా సరదా మనిషి అంటుంటే.. మరికొందరు.. కాస్త ఓవర్ అయిందేమో అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. 13.1 బంతికి సిరాజ్ లూయిస్ కింబర్‌ను (31పరుగులు) ఔట్ చేశాడు. ప్రస్తుం పంత్, జాయ్ ఎవిషన్ క్రీజులో ఉన్నారు.
తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్
లీసెస్టర్‌షైర్ (బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ ప్లేయింగ్ 11): శామ్యూల్ ఎవాన్స్ (కెప్టెన్), లూయిస్ కింబర్, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రెహాన్ అహ్మద్, శామ్యూల్ బేట్స్ (వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలీ, అబిదిన్ సకాండే , జోయ్ ఎవిసన్


Click it and Unblock the Notifications












