రేపే టీమిండియా టీ20 మ్యాచ్: పిచ్, వెదర్ రిపోర్ట్ ఇదే: పించ్ హిట్టర్లతో

ముంబై: యంగ్ టీమిండియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రస్థానాన్ని ఆరంభించింది. విదేశీ పర్యటనల్లో భాగంగా తొలి సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడబోతోంది. రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. రెండవది 28వ తేదీన ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా రాజధాని డబ్లిన్‌లోని మలహిడె స్టేడియంలో నిర్వహిస్తోంది క్రికెట్ ఐలండ్ బోర్డ్.

జోరుగా నెట్ ప్రాక్టీస్..
రెండు జట్ల ప్లేయర్లు డబ్లిన్ స్టేడియంలో విస్తృతంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నారు. టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ల జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నందున.. ఐర్లాండ్‌తో సిరీస్‌కు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ అయ్యాడు. లక్ష్మణ్ కోచ్ అవతారం ఎత్తడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో బాగా ఆడిన ప్లేయర్లకు బీసీసీఐ మరో అవకాశాన్ని ఇవ్వొచ్చు. వారిని ఇంగ్లాండ్‌తో తలపడబోయే సీనియర్ల జట్టులో స్థానం కల్పించవచ్చు.

వర్షం పడటానికి స్వల్ప అవకాశాలు..
ఐర్లాండ్ వాతావరణం భారత్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ చలి ఎక్కువ. ప్రస్తుతం 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికి వర్షం పడే అవకాశాలు కూడా లేకపోలేదు. దాదాపుగా ఇదే వాతావరణం ఆదివారం కూడా ఉంటుందని ఐర్లాండ్ వాతావరణ కేంద్రం తెలిపింది. మ్యాచ్ రోజు తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. పగటిపూట గరిష్ఠంగా 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. రాత్రి వేళ 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని పేర్కొంది.

మందకొడి పిచ్..
డబ్లిన్ స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుంది. ఈ పిచ్‌పై పేసర్లు పెద్దగా రాణించలేకపోవచ్చు. పిచ్ పరిస్థితులను స్పిన్నర్లు అనుకూలంగా మలచుకోవడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-ఐర్లాండ్ ఇప్పటివరకు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడుసార్లూ భారత్‌దే పైచేయి. మలహిడె స్టేడియంలో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరిగాయి. తొలి సారి బ్యాటింగ్ చేసిన జట్టు ఏడుసార్లు గెలిచింది. ఛేజింగ్ టీమ్‌ది 11 సార్లు పైచేయి. తొలి ఇన్నింగ్ యావరేజ్ 153.. రెండో ఇన్నింగ్ యావరేజ్ 136 పరుగులు.

హయ్యెస్ట్ స్కోర్ ఇదే..
స్కాట్లాండ్-నెదర్లాండ్ మధ్య ఇదే స్టేడియంలో జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ నమోదైంది. మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు హయ్యెస్ట్. లోయెస్ట్ స్కోర్ 70 పరుగులు. భారత్-ఐర్లాండ్ మధ్య ఈ స్కోర్ రికార్డయింది. హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్ 194 పరుగులు. ఛేజింగ్‌లో లోయెస్ట్ స్కోర్ 129 పరుగులు. టీమిండియాలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్ వంటి పించ్ హిట్టర్లు ఉన్నందున ఎవరు భారీ స్కోర్ సాధిస్తారనేది ఆసక్తికరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications