హోమిల్టన్: ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు గెలిచి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఐర్లాండ్ పైన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఎన్నో రికార్డులు సృష్టించింది. 8 వికెట్ల తేడాతో భారత్ గెలవడంతో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును ధోనీ సేన బద్దలుకొట్టినట్లయింది.
ఇది టీమిండియాకు వరుసగా ఐదో విజయం. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 9 విజయాలను నమోదు చేసిన చేసింది. తద్వారా రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా.. మ్యాచ్ సమయంలో కెప్టెన్ ధోనీ తన సహచరులకు చేసిన కామెంట్స్ స్టంప్ మైక్రో ఫోన్స్‌లో రికార్డయ్యాయి. అవి ఆసక్తికరంగా ఉన్నాయి. జడెజా, అంబటి రాయుడు తదితరులకు సూచనలు చేశాడు. అందులో కొన్ని కెమెరాకు చిక్కాయి.

జడెజా తన మూడో ఓవర్ మొదటి బంతి వేస్తున్న సమయంలో ధోనీ సూచనలు ఇచ్చాడు. ధోనీ క్లాప్స్ కొట్టి పిలిచాడు. ఫ్రంట్ పూట్ ద్వారా కొట్టనివ్వు అని సూచించాడు. రైనా 29వ ఓవర్ బౌలింగ్ వేస్తున్నాడు. పోర్టర్ ఫీల్డ్ 64 పరుగులతో ఆడుతున్నాడు. అతను సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ అంబటి రాయుడు వైపుకు ఆడుతున్నాడు.
అప్పుడు ధోనీ రాయుడిని పిలిచాడు. రాయుడు.. జాగ్రత్తగా ఉండు. అతని ఫీట్ మూమెంట్ ముందుగానే అంచనా వేయు. వాలీబాల్ గేమ్‌లో మధ్యలా అలా నిలబడకు అని సూచించాడు.
రైనా బౌలింగ్ చేస్తుండగా... పక్కనే నిలబడమని సూచించాడు. అతను బంతిని మెల్లిగా కొట్టడని చెప్పాడు. అశ్విన్ 21వ ఓవర్ బౌలింగ్ వేస్తున్న సమయంలో.. బ్యాట్స్‌మెన్ టాప్‌కు కొట్టాలనుకుంటున్నాడని, రెడీగా ఉండాలని, నీ వైపే కొడతాడని ధోనీ ఫీల్డర్‌ను ఉద్దేశించి చెప్పాడు.