ఇజ్జత్ పాయే!.. క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్!!
బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ స్టేడియంలో ఆదివారం జరిగిన కీలక రెండో టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ కేవలం 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఐర్లాండ్ జట్టు 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ జట్టు భారత్‌పై ఒక టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ షాకింగ్ ఓటమితో అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 16 టీ20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా చారిత్రాత్మక విజయాల పరంపరకు బ్రేక్ పడింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి, భారత్ ముందు 155 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు ఇద్దరూ 'గోల్డెన్ డక్' కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే ఔటయ్యాడు. వీరి ముగ్గురినీ ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రా పెవిలియన్‌కు పంపాడు. ఇషాన్ కిషన్ (12) రనౌట్ కావడంతో భారత్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఆ దశలో తిలక్ వర్మ, అక్షర్ పటేల్‌లు ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అక్షర్ అవుట్ అయిన తర్వాత శివం దూబే (20) తో కలిసి తిలక్ వర్మ ఆరో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడి 46 బంతుల్లో 55 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేసి హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ.. కీలక సమయంలో ఔట్ కావడంతో భారత్ విజయం కష్టమైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావాల్సిన తరుణంలో హర్షిత్ రాణా (21) కొన్ని భారీ షాట్లు ఆడి ఆశలు రేపాడు. ఆఖరి బంతికి అరంగేట్రం ఆటగాడు ప్రిన్స్ యాదవ్ సిక్స్ కొట్టినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో భారత్‌కు ఒక్క పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, మాథ్యూ హాలార్డ్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ 47 బంతుల్లో 53 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. బెంజమిన్ కాలిట్జ్ (37), జార్జ్ డోక్రెల్ (19) రాణించడంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అరంగేట్ర ప్లేయర్ ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేయగా.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలు చెరో 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications