Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా Vs ఎసెక్స్, డే 2: భారత్ 395 ఆలౌట్

India vs Essex, Day 2 lunch: India all out for 395

హైదరాబాద్: ఎసెక్స్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత బ్యాట్స్‌మెన్లలో దినేశ్ కార్తీక్‌(82‌)తోపాటు విరాట్‌ కోహ్లీ(68), హార్థిక్‌ పాండ్యా(51‌), ఓపెనర్‌ మురళీ విజయ్‌(53), కేఎల్‌ రాహల్‌(58) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఓవర్ నైట్ స్కోరు 322/6తో రెండోరోజైన గురువారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 73 పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ 26 బంతుల్లో 34 పరుగులు చేసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్సెక్స్ జట్టు ఓపెనర్లు నిక్ బ్రౌనీ, వరుణ్ చోప్రాలు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ నాలుగో బంతికి బ్రౌనీ(11) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.

దీంతో రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఎసెక్స్ జట్టు 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ చోప్రాను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ వెస్లీ, పెప్పర్‌ నిలకడగా ఆడారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు.

వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో జట్టు కష్టాల్లో పడకుండా అడ్డుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్‌ (1/41) విడదీశాడు. వెస్లీని పెవిలియన్‌కు చేర్చాడు.

పెప్పర్‌, రిషి కేతన్‌ (19) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో 186/5తో ఇంగ్లాండ్‌ కష్టాల్లో పడింది. అయితే ఫాస్టర్స్‌ (23 బ్యాటింగ్‌), వాల్టర్‌ (22 బ్యాటింగ్‌) మరో వికెట్‌ పడకుండా ఆడి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు.

Story first published: Friday, July 27, 2018, 11:43 [IST]
Other articles published on Jul 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+