Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భరత్‌కు నో ఛాన్స్.. అందుకే జట్టులో నాలుగు మార్పులు - రోహిత్

భారత్-ఇంగ్లండ్ మరో సమరానికి సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. తొలి టెస్టులో పర్యాటక జట్టు ఇంగ్లండ్, రెండో టెస్టులో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా, టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో నాలుగు మార్పులు చేశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రాజ్‌కోట్ టెస్టులో భారత ఇద్దరు యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేస్తున్నారు. వికెట్ల వెనుక రాణిస్తున్నా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న కేఎస్ భరత్ తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో ఉత్తరప్రదేశ్ కుర్రాడు ధ్రువ్ జట్టులోకి వచ్చాడు.

India vs Englnd: Weve made four changes- Rohit Sharma

''మేం తొలుత బ్యాటింగ్ చేస్తాం. జట్టులో నాలుగు మార్పులు చేశాం. గాయాలు, కొందరి రాకతో జట్టులో మార్పులు జరిగాయి. ఇవాళ ఇద్దరు అరంగేట్రం చేయనున్నారు. సిరాజ్, జడేజా జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తుది జట్టులో లేరు. పిచ్ బాగుంది. గత రెండు టెస్టు మ్యాచ్‌ల కంటే ఇది మెరుగ్గా కనిపిస్తుంది. మ్యాచ్ సాగే కొద్ది నెమ్మదిస్తుంది. జట్టుకు అవసరమైనప్పుడు కుర్రాళ్లు అండగా నిలిచారు. తొలి టెస్టులు ఆసక్తికరంగా సాగినట్లే చివరి మూడు టెస్టులు జరుగుతాయని ఆశిస్తున్నా'' అని రోహిత్ శర్మ తెలిపాడు.

1
58583

భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

మరోవైపు ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్‌‌తో బరిలోకి దిగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఇంగ్లండ్ ఆడిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌కు ఎంతో స్పెషల్‌ కానుంది. తన కెరీర్‌లో స్టోక్స్ ఇవాళ 100వ టెస్టు ఆడనున్నాడు.

ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.

Story first published: Thursday, February 15, 2024, 9:22 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+