న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్‌..: చాహల్‌ ఖాతాలో ఓ చెత్త రికార్డు

ICC Cricket World Cup 2019 : Chahal Becomes Most Expensive Indian Bowler In World Cup History
Chahal

ప్రపంచ‌కప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న రికార్డును చహల్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చహల్‌ తన కోటా 10 ఓవర్లలో 88 పరుగులిచ్చాడు. దీంతో చహల్‌ పేరిట వన్డేల్లో చెత్త రికార్డు నమోదైంది. గతంలో వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడూ చహల్‌ ఇన్ని భారీ పరుగులు ఇవ్వలేదు.

తాజా ప్రదర్శనతో భారత తరపున ప్రపంచ‌కప్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు కూడా చహల్‌ మూటగట్టుకున్నాడు. 2003 ప్రపంచ‌కప్‌ ఫైనల్లో మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ 87 పరుగులు ఇచ్చాడు. కర్సన్ గౌరీ (83), రవిచంద్రన్ అశ్విన్ (75), మోహిత్ శర్మ (75)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక ఈ ప్రపంచ‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శనగా నమోదైంది. అంతకముందు ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (110 పరుగులు-ఇంగ్లండ్‌పై), శ్రీలంక పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ (88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లుగా ఉన్నారు. ఆ తర్వాత స్థానం చహల్‌దే.

1
43681

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసి భారత్ ముందు 338 పరుగుల లక్ష్యంను ఉంచింది. ఇంగ్లండ్ జట్టులోని ప్రతీ బ్యాట్స్‌మన్‌ బ్యాట్ జులిపించడంతో పరుగుల వరద పారింది. ఓపెనర్ బెయిర్‌స్టో (100: 90 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు శతకం చేసాడు.

మరో ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (66; 57బంతుల్లో 7×4, 2×6), స్టోక్స్‌(79; 54బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. లక్ష్య ఛేదనలో భారత్ తొలి వికెట్ ను త్వరగానే కోల్పోయినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (31), కెప్టెన్ విరాట్ కోహ్లీ (43)లు జట్టును ఆదుకున్నారు.

{headtohead_cricket_2_3}

Story first published: Sunday, June 30, 2019, 21:06 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X