Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన జైస్వాల్ (Video)

వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతుల్లో ద్విశతకాన్ని బాదాడు. సెంచరీ సాధించిన స్టైల్‌లోనే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది 200 మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సృష్టించాడు.

భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన మూడో పిన్నవయస్కుడిగా యశస్వీ జైస్వాల్ రికార్డులకెక్కాడు. జైస్వాల్‌ వయసు 22 ఏళ్ల 37 రోజులు. టీమిండియా తరఫున ద్విశతకం సాధించిన అత్యంత తక్కువ వయస్సు ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో వినోద్ కాంబ్లీ ఉన్నాడు. 1993లో ఇంగ్లండ్‌పై (21 ఏళ్ల 35 రోజులు), జింబాబ్వే (21 ఏళ్ల 55 రోజులు) కాంబ్లీ డబుల్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ తన 21 ఏళ్ల 283 రోజుల వయసులో వెస్టిండీస్‌పై 220 పరుగులు సాధించాడు.

India vs England: Yashasvi Jaiswal made history with a double century

అంతేగాక భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన నాలుగో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఎడమచేతి వాటం బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (239 పరుగులు, పాకిస్థాన్‌పై), వినోద్ కాంబ్లీ (227; జింబాబ్వేపై, 224, ఇంగ్లండ్‌పై), గౌతమ్ గంభీర్ (206, ఆస్ట్రేలియాపై) మాత్రమే ఈ ఘనత సాధించారు. జైస్వాల్ మరో రికార్డు సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు.ఈ ఘనతను అంతకుముందు విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ సాధించారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ నిర్భయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల దగ్గర హిట్టింగ్‌తో పరుగులు సాధించడం విశేషం. హాఫ్ సెంచరీని బౌండరీతో, సెంచరీని సిక్సర్‌తో, 150ని ఫోర్‌తో అలాగే డబుల్ సెంచరీని బౌండరీతో సాధించడం విశేషం. కాగా, 336/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.

Story first published: Saturday, February 3, 2024, 10:52 [IST]
Other articles published on Feb 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+