వరల్డ్ టీ20: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20 టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమిండియా ఫైనల్ బెర్తుపై కన్నేసింది. శుక్రవారం జరిగే సెమీపైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన భారత మహిళల జట్టు ఈసారి ఏకంగా టైటిల్‌పై కన్నేసింది.
అయితే, మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు భారత జట్టుకు ఎంతమాత్రం కలిసిరాలేదు. 2009, 2010 టోర్నీల్లో సెమీస్ చేరినప్పటికీ, ఫైనల్‌కు అర్హత సాధించడంలో భారత్ మాత్రం విఫలమైంది. 2009లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడగా... 2010లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రెండు సార్లు సెమీస్ చేరినా ఫైనల్ చేరని భారత్
రెండు సార్లు సెమీస్ చేరినా ఫైనల్ చేరలేని భారత్... ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని ఊవిళ్లూరుతోంది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు గ్రూపు దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టీమిండియా గెలిచి సెమీస్ చేరుకుంది.

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీ చేయగా
తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీ చేయగా... చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన రెండో రౌండ్ పోటీలో బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో పాటు మిథాలీ రాజ్ మెరుపు హాఫ్ సెంచరీతో సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మూడు విజయాలతో భారత జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

లీగ్ స్టేజిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో
లీగ్ స్టేజిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి గ్రూప్-బీ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుత టోర్నీలో హర్మన్ ప్రీత్ సేన జోరు చూస్తుంటే ఫైనల్ చేరడం ఖాయమనే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఆడిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరితే టీమిండియా చరిత్రను తిరగరాస్తుంది.

నార్త్ సౌండ్ - ఆంటిగ్వా
శుక్రవారం ఉదయం 5.30 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్
హాట్ స్టార్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్

భారతదేశం:
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన, జెమిమ రోడ్రిగ్స్, మిథాలీ రాజ్, దీప్తి శర్మ, దయాళన్ హేమలాథ, వేదా కృష్ణమూర్తి, అరుంధతీ రెడ్డి, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, భాటియా (వికెట్ కీపర్), మన్సి జోషి, దేవిక వైద్య, అనుజ పాటిల్.
ఇంగ్లాండ్:
హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బీయుమొంట్, సోఫియా డంక్లీ, సోఫీ ఎస్లెస్టోన్, టాష్ ఫారన్, కిర్స్టీ గోర్డాన్, జెన్నీ గన్, డానియెల్ హజెల్, అమీ జోన్స్, నాటాలీ సైజ్వర్, అన్య ష్రుబ్లోల్, లిన్సీ స్మిత్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్ఫీల్డ్, డానిల్లే వ్యాట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications