కెప్టెన్‌గా మంధానకు తొలి ఓటమి: తొలి వన్డేలో ఇంగ్లాండ్ విజయం

హైదరాబాద్: ఇంగ్లాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్‌ను మాత్రం ఓటమితో ఆరంభించింది. గౌహతి వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమైన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో ఓపెనర్ స్మృతి మంధాన నాయకత్వ పగ్గాలను చేపట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో టామీ బ్యూమౌంట్(62: 57 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా, కెప్టెన్ హీధర్ నైట్ (40: 20 బంతుల్లో 7 ఫోర్లు) ఫరవాలేదనిపించింది.

రాధా యాదవ్‌కు రెండు వికెట్లు
భారత బౌలర్లలో రాధా యాదవ్ రెండు వికెట్లు తీయగా.. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత మహిళల జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (2) ఒత్తిడికి గురవగా.. మరో ఓపెనర్ హర్లీన్ (8) తీవ్రంగా నిరాశపరిచింది.
నిరాశపరిచిన స్మృతి మంధాన
అనంతరం వచ్చిన జెమీయా రోడ్రిగ్స్ (2), మిథాలీ రాజ్ (7), వేద (15) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. చివర్లో దీప్తి శర్మ (22), అరుంధతి రెడ్డి (18) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ... జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై ఇంగ్లాండ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గురువారం రెండో టీ20
ఇంగ్లాండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, లిన్సీ స్మిత్ చెరో రెండు వికెట్లు, అన్యా శ్రుబ్సోల్, కేట్ క్రాస్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 గురువారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications