For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్ టెస్టు: స్టోక్స్ స్థానంలో వోక్స్, ఇంగ్లాండ్ జట్టులోకి ‘పోప్‌’

By Nageshwara Rao
India vs England: Woakes replaces Stokes, Pope in England squad

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన కనబర్చిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌పై వేటు పడగా... బ్రిస్టల్ నైట్‌ క్లబ్‌ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తప్పుకోవాల్సి వచ్చింది.

దీంతో వీరిద్దరి స్థానాల్లో ఒలివర్‌ పోప్, క్రిస్‌ వోక్స్‌లను ఇంగ్లాండ్‌ సెలక్టర్లు రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఎడ్జ్‌బాస్టన్‌లో 8,20 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ స్లిప్‌లో కీలక క్యాచ్‌లు వదిలేశాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో 20 ఏళ్ల పోప్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉండటం విశేషం.

1
42375

15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 63.25 సగటుతో అతను 1,012 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ఇంగ్లాండ్‌ మిడిలార్డర్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అవసరం కూడా ఉండటంతో పోప్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు.

ఈ ఏడాది జూన్‌లో పాక్‌తో జరిగిన టెస్టు సిరిస్‌‌లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన క్రిస్ వోక్స్‌ ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. కాగా, గతేడాది నవంబర్‌లో బ్రిస్టల్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడి గుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన కేసు బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ విచారణ వాయిదా పడితేనే బెన్ స్టోక్స్ లార్డ్స్ టెస్టులో ఆడే అవకాశం ఉంది. ఒకవేళ స్టోక్స్ రెండో టెస్ట్ ఆడలేకపోతే.. ముందు జాగ్రత్తగా అతడి స్థానంలో క్రిస్ వోక్స్‌ను ఆడించాలని సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆగస్టు 9 నుంచి లార్డ్స్‌ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది.

లార్డ్స్ టెస్టులో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టు:
Joe Root (c), Moeen Ali, Jimmy Anderson, Jonny Bairstow (wk), Stuart Broad, Jos Buttler, Alastair Cook, Sam Curran, Keaton Jennings, Ollie Pope, Jamie Porter, Adil Rashid, Chris Woakes.

Story first published: Monday, August 6, 2018, 12:18 [IST]
Other articles published on Aug 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+