
ఐసీసీ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో ఇంగ్లాండ్
భారత్‌పై రెండో వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసుంటే అప్పుడు భారత్‌కి అగ్రస్థానం దక్కేది. ఇప్పుడు మూడో వన్డేలో భారత్ గెలిచినా కూడా ఇంగ్లాండ్ నెం.1 స్థానానికి ఢోకా ఉండదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 పాయింట్లతో ఉండగా.. భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

‘టీమిండియా చాలా బలమైన జట్టు'
‘టీమిండియా చాలా బలమైన జట్టు. తొలి వన్డేలో ఆ జట్టు గెలిచిన తీరే అందుకు నిదర్శనం. టెస్టు సిరీస్‌కి ముందు.. భారత్‌ను వన్డే సిరీస్‌లో ఓడించడం మాకు చాలా ముఖ్యం. అలా చేయగలిగితే.. ఇంగ్లాండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్‌లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వారిని ఎదుర్కొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. రెండో వన్డేలో సెంచరీ బాదిన జో రూట్ మూడో వన్డేలోనూ అదేజోరుని కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. ఐసీసీ ర్యాంక్ కంటే భారత్‌పై సిరీస్ గెలవడం ఇంగ్లాండ్‌కి ముఖ్యం' అని ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు.

రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'
జింబాబ్వేపై 2016లో చాహల్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 25 వన్డేలు ఆడి.. 45 వికెట్లు తీసుకున్నాడు. ఇక 26 టీ20ల్లో ఈ లెగ్‌స్పిన్నర్ 42 వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో ఒక ఫోర్), కోహ్లి (45; 56 బంతుల్లో 2ఫోర్లు) రాణించారు. ప్లంకెట్ (4/46), రషీద్ (2/38), విల్లీ (2/48) భారత్‌ను దెబ్బతీశారు. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ధోని (37; 59 బంతుల్లో 2ఫోర్లు), హార్దిక్ పాండ్య (21) క్రీజులో ఉన్నప్పుడు భారత్ కాస్త ఆశతోనే ఉంది.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో
కానీ 39వ ఓవర్లో పాండ్య ఔట్ కావడంతో అది కూడా పోయింది. ధోని 47వ ఓవర్‌కు వరకు క్రీజులోనే ఉన్నా భారత్ ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. కష్టంగా పరుగులొచ్చాయి. ధోని ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి సరిపోయిందంతే. టెయిలెండర్ల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో 86పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications
