ఇండియా Vs ఇంగ్లాండ్: గంగూలీ రికార్డుని ఎడ్జిబాస్టన్‌లో కోహ్లీ అధిగమిస్తాడా?

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి జరిగే తొలి టెస్టులో టీమిండియా తలపడనుంది. ఈ టెస్టుకు బర్మింగ్‌హామ్ వేదిక కానుంది.
ఈ తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇంతకీ ఆ రికార్డు ఎవరిదో తెలుసా? టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. టీమిండియా కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ టెస్టుల్లో మొత్తం 21 విజయాలను నమోదు చేశాడు.

21 టెస్టు విజయాలతో గంగూలీతో సమానంగా
విరాట్ కోహ్లీ సైతం 21 టెస్టు విజయాలతో మాజీ కెప్టెన్ గంగూలీతో సమంగా ఉన్నాడు. అంతేకాదు టీమిండియాకు అత్యధిక విజయాలను అందించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో గంగూలీతో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఒక్క టెస్టు గెలిచినా కెప్టెన్‌గా కోహ్లీ టెస్టుల్లో 22వ విజయం విజయాన్ని నమోదు చేస్తాడు.

గంగూలీని దాటి కోహ్లీ రెండో స్థానంలో నిలుస్తాడా?
దీంతో గంగూలీని దాటి కోహ్లీ రెండో స్థానంలో నిలుస్తాడు. ఇప్పటివరకు భారత జట్టుకు కెప్టెన్‌గా అత్యధిక విజయాలను అందించిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా 60 టెస్టు మ్యాచ్‌లాడగా 27 విజయాలను నమోదు చేశాడు. కాగా, ధోని సాధించిన మొత్తం 27 విజయాల్లో సొంతగడ్డపై గెలిచినవే ఎక్కువగా ఉన్నాయి.

స్వదేశంలో ధోనిసేన 21 టెస్టులను గెలవగా
స్వదేశంలో ధోనిసేన 21 టెస్టులను గెలవగా, విదేశీ గడ్డపై కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాన్ని నమోదు చేసింది. ఇక, కోహ్లీ విషయానికి వస్తే సొంతగడ్డపై 13, విదేశీ గడ్డపై 8 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ సిరిస్‌లో కోహ్లీ మొత్తం 4 మ్యాచ్‌లాడి 692 పరుగులు నమోదు చేశాడు.

కోహ్లీ విన్ పర్సంటేజీ 60శాతంగా
ఆస్ట్రేలియాలో ఓ భారత బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. అంతేకాదు, టెస్టుల్లో కోహ్లీ విన్ పర్సంటేజీ 60శాతంగా ఉండటం విశేషం. మరోవైపు విదేశీ గడ్డపై అత్యధిక విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా దాదా నిలిచాడు. గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 21 విజయాలను నమోదు చేయగా, సొంతగడ్డపై 10, విదేశీ గడ్డపై 11 ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications