Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20: ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలిస్తే చరిత్రే (ఫోటోలు)

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 ఆడేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు బుధవారం బెంగుళూరుకు చేరుకున్నాయి. ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో మ్యాచ్ కావడంతో ఇరు జట్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి.

టెస్టు సిరీస్‌ను 4-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా తొలి టీ20లో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. అయితే చివరి ఓవర్లలో బుమ్రా మ్యాజిక్‌తో భారత్‌ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టీ20ని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాలని కెప్టెన్ కోహ్లీ చూస్తున్నాడు.

ఇప్పటిదాకా ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ నెగ్గలేదు

ఇప్పటిదాకా ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ నెగ్గలేదు

టీ20 ఫార్మాట్‌లో ఇప్పటిదాకా ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ నెగ్గలేదు. దీంతో ఈ ఆ అవకాశాన్ని వదులు కోకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. మరోవైపు ఇప్పటికే రెండు సిరీస్‌లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీ20 ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా నిరాశ

కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా నిరాశ

రెండో టీ20లో విజయం నుంచి అనూహ్యంగా ఓడిపోవడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా నిరాశ చెందాడు. భారత గడ్డపై సుదీర్ఘ పర్యటనలో శూన్య హస్తంతో వెనుదిరగ కూడదంటే తమ ఆటగాళ్లు మరింత క్రమశిక్షణతో ఆడాలని చెబుతున్నాడు. బెంగళూరులో ఎలాగైనా నెగ్గి టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి భారతపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

మూడో టీ20 విజయం కోహ్లీ, యువరాజ్‌, ధోనీ, రైనాపైనే

మూడో టీ20 విజయం కోహ్లీ, యువరాజ్‌, ధోనీ, రైనాపైనే

స్టార్‌ ప్లేయర్లు కోహ్లీ, యువరాజ్‌, ధోనీ, రైనాలు ఈ మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు రాణించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ల్లో యువరాజ్‌ పూర్తిగా నిరాశ పరిచాడు. తొలి మ్యాచ్‌లో పోరాడిన రైనా, ధోనీ నాగ్‌పూర్‌లో విఫలమయ్యారు. సిరీస్‌ విజేత నిర్ణయించే ఈ చివరి టీ20లో వీరి నుంచి అభిమానులు భారీగా ఆశిస్తున్నారు.

చిన్నస్వామి స్టేడియం కోహ్లీ, రాహుల్‌లు అద్భుతాలు

చిన్నస్వామి స్టేడియం కోహ్లీ, రాహుల్‌లు అద్భుతాలు

కాగా, రెండో టీ20లో అర్ధ సెంచరీతో ఓపెనర్‌ లోకేష్‌ రాహుల్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి రావడం జట్టుకు లాభించనుంది. ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడే కోహ్లీ, రాహుల్‌కు చిన్నస్వామి స్టేడియంలో ఎన్నో అద్భుతాలు చేశారు. గత సీజన్‌లో ఇక్కడ అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరిపై ఇక్కడి ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

పునరుద్ధరణ తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే

పునరుద్ధరణ తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే

చిన్నస్వామి మైదానాన్ని పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే. ఇటీవల రూ. 4.5 కోట్లతో మైదానాన్ని అధునాతనంగా మార్చారు. అవుట్‌ ఫీల్డ్‌ను మాత్రం కొత్తగా తీర్చిదిద్ది అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారు. పిచ్‌ మాత్రం ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు అనుకూలం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ షాట్లకు అవకాశం ఉందని క్యురేటర్‌ శ్రీరామ్‌ చెప్పాడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, పర్వేజ్ రసూల్, ఆశిష్ నెహ్రా, యుజవేంద్ర చాహాల్, జస్‌ప్రీత్ బుమ్రా, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) , భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిలింగ్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్కీపర్), మొయిన్ ఆలీ, క్రిస్ జోర్డాన్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్, జోనాథన్ బెయిర్స్టో, జేక్ బాల్, లియం డాసన్, డేవిడ్ విల్లీ.

మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7 గంటలకు

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+