న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఓ మై గాడ్.. మళ్లీ టర్న్ అవుతుందా? బ్రాడ్, బెయిర్‌స్టో, రూట్‌పై సెటైర్లు వేసిన జాఫర్!!

India vs England: Wasim Jaffer trolls Joe Root, Stuart Broad and Jonny Bairstow
India VS England : India Shouldn't Be Scared To Prepare Fair Pitches - Shoaib Akhtar || Oneindia

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి మొతెరాలో ఆఖరి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. చివరిదైన నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్‌ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఆధ్వర్యంలో మంగళవారం జట్టు ఆటగాళ్లంతా నెట్స్‌లో చెమటోడ్చారు. మూడో టెస్ట్ మ్యాచ్ లాగానే నాలుగో టెస్టులో కూడా పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో స్పిన్ బౌలింగ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ అందరూ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సందర్భంగా కాలింగ్‌వుడ్ సహా ఆటగాళ్లు అందరూ పిచ్‌ను పరిశీలించారు.

India vs England: అరుదైన రికార్డు ముంగిట పుజారా.. మరో 45 పరుగులు చేస్తే!!India vs England: అరుదైన రికార్డు ముంగిట పుజారా.. మరో 45 పరుగులు చేస్తే!!

పిచ్‌ను పరిశీలిస్తున్న ప్లేయర్స్:

ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలిస్తున్న ఓ ఫొటోను టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుని వారిపై సెటైర్లు వేశాడు. జాఫర్ పంచుకున్న పోస్ట్‌లో ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, పేసర్ మార్క్ వుడ్, ఓపెనర్ జానీ బెయిర్‌స్టో, కెప్టెన్ జో రూట్, అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఉన్నారు. వీరందరూ మొతేరా పిచ్‌ను తదేకంగా పరిశీలిస్తున్నారు. అయితే వారి మధ్య సంభాషణ ఇలా ఉందని జాఫర్ సరదాగా వివరించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మా ఖేల్ కతం:

మా ఖేల్ కతం:

పిచ్‌ను చూసిన స్టువర్ట్ బ్రాడ్.. 'ఇక నా పర్యటన ముగిసింది' అని అంటాడు. ఆ పక్కనే ఉన్న మార్క్ వుడ్ స్పందిస్తూ.. 'కనీసం మీరు ఒక మ్యాచ్ అయినా ఆడారు బ్రో' అని పేర్కొన్నాడు. టెస్ట్ సిరీస్‌లో వుడ్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. పింక్ బాల్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్ అయిన జానీ బెయిర్‌స్టో ఫ్లాట్ పిచ్ కోసం ఆశతో ఎదురుచూస్తున్నాడని వసీం జాఫర్ పంచ్ వేశాడు. రూట్ పిచ్ వైపు చూస్తూ.. 'ఓ షిట్.. ఇక మా ఖేల్ కతం' అని అంటాడని జాఫర్ ట్రోల్ చేశాడు. 'ఓ మై గాడ్.. మళ్లీ టర్న్ అవుతుందా?' అని కాలింగ్‌వుడ్ అంటున్నాడని జాఫర్ సరదాగా పేర్కొన్నాడు.

112, 145 పరుగులకు ఆలౌట్:

112, 145 పరుగులకు ఆలౌట్:

డేనైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా.. భారత్‌ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌కు ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. అందుకే నాలుగో టెస్టులో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ సన్నద్ధమవుతోంది.

పిచ్‌ను అంచనావేయలేకపోయాం:

పిచ్‌ను అంచనావేయలేకపోయాం:

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని కెప్టెన్‌ జో రూట్‌ తాజాగా వివరించాడు. పింక్‌బాల్‌ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు.‌ నాలుగో టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. 'పింక్‌బాల్‌ టెస్టులో మా జట్టు ఎంపికలో తప్పు జరిగింది. పిచ్‌ను అంచనావేయలేకపోయాం. గతంలో భారత్‌లో జరిగిన పింక్‌బాల్‌ టెస్టు పరిస్థితులను బట్టి, అక్కడ బంతి ఎలా స్పందించిందనే విషయాల పైనే ఈ మ్యాచ్‌లో తుది జట్టును ఎంపిక చేశాం. కానీ, బంతి ఇలా తిరుగుతుందని ఊహించలేదు' అని అన్నాడు.

Story first published: Wednesday, March 3, 2021, 15:08 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X