Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టెస్టు సిరీస్‌ను చేజాతులారా చేజార్చుకుంది'

India Vs England: VVS Laxman feels Virat Kohli and Co. kept repeating mistakes on the tour

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్హణ్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ చేజాతులారా చేజార్చుకుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీసేన తప్పులను పునరావృతం చేస్తూ.. ఓటమిని కొనితెచ్చుకుందని పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా తరపున చాలా మ్యాచ్‌లలో ఆడిన వీవీఎస్ లక్ష్మణ్ భారత్‌ జట్టుకు చాలా సందర్భాల్లో వెన్నెముకగా నిలిచాడు. ఇప్పటికే ప్రముఖ మీడియాలన్నీ కోహ్లీసేనపై విమర్శలు ఎక్కిపెడుతున్నా.. కోహ్లీ టెయిలెండర్ల విషయంలో పెద్ద తప్పే చేశాడు.

'నేనొకటే విషయాన్ని స్ఫష్టంగా చెప్పగలను. భారత్ జట్టు చేసిన తప్పే మళ్లీ చేస్తూ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. టీమిండియా అతి విశ్వాసమే పరాజయానికి కారణమవుతోంది. కేవలం టాప్ ఆర్డర్‌పైనే దృష్టి పెట్టి టెయిలెండర్ల విషయమే మర్చిపోతున్నారు. ఓవల్ స్టేడియంలో మాత్రం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల భాగస్వామ్యంలో జరిగిన ఆట నన్నెంతగానో సంతృప్తిపరచింది.'

'అస్సలు గెలుస్తామనే ఆశలు లేని టీమిండియాకు కాసేపటి వరకూ వాళ్లు గెలుపు ఆశ రుచి చూపించారు. ఇద్దరి సెంచరీలు టీమిండియాకు మంచి స్కోరును తెచ్చిపెట్టాయి. అప్పటి వరకూ రాహుల్ ఆడిన మ్యాచ్‌లలో నిరుత్సాహపరుస్తూనే వస్తున్నాడు. పంత్ మాత్రం దానికి భిన్నంగా ఆరంభం నుంచే అదే శైలి కొనసాగిస్తున్నాడు. ఇటువంటి క్రమంలో వాళ్లు ఆడిన తీరు మంచి సంతృప్తినిచ్చింది.'

కోహ్లీ తొలిసారి కెప్టెన్‌గా 2014వ సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటన చేశాడు. ఆ సమయంలో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ ఈ సారి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఆడి చూపించాడు. కానీ, ఓ కెప్టెన్‌గా మాత్రం ఎవ్వరి అంచనాలను అందుకోలేకపోయాడు. మిగిలిన జట్టు పూర్తిగా అన్ని మ్యాచ్‌లలోనూ అంతంత మాత్రంగానే అనిపించాయి.

Story first published: Thursday, September 13, 2018, 17:22 [IST]
Other articles published on Sep 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+