Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG Highlights: ఎగిరిపడ్డ ఇంగ్లండ్ వికెట్లు చూశారా? (Video)

టీమిండియా అదరగొట్టింది. బజ్‌బాల్ చతికలపడింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుని 1-1తో సిరీస్‌ను రోహిత్ సేన సమం చేసింది. వైజాగ్ టెస్టులో బుమ్రా బుల్లెట్ బంతులు, తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి.

అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మన బౌలర్లు ప్రదర్శనే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. పక్కా ప్లాన్‌తో ఇంగ్లాండ్ ఆటగాళ్లను టీమిండియా బౌలర్లు పెవిలియన్‌కు చేర్చిన తీరు అమోఘం. కాగా, ఇవాళ ఆటలో వికెట్ వేట మొదలుపెట్టింది అక్షర్ పటేల్. 67/1తో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ కాస్త దూకుడుగానే పరుగులు చేసింది. అయితే నైట్ వాచ్‌మన్ రెహాన్ అహ్మద్‌ను అక్షర్ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

India vs England Vizag test Highlights- India won by 106 runs

గత టెస్టు హీరో ఒలీ పోప్‌ను రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. అశ్విన్ వేసిన బాల్‌ను షాట్‌కు యత్నించి పోప్ దొరికిపోయాడు. కాసేపటికే రూట్‌ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు.

లంచ్ విరామానికి పది నిమిషాల ముందు భారత్ బౌలర్లు చెలరేగారు. ప్రమాదరకరంగా మారుతున్న క్రాలేను కుల్‌దీప్, బెయిర్‌స్టోను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు.

రెండో సెషన్‌లో బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ విసిరిన మెరుపు 'త్రో'కు పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్ పతనానికి ఎక్కువ సమయం పట్టలేదు. భారత్ విజయానికి అడ్డుపడుతున్న టామ్ హర్ట్‌లీని బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు.

స్కోరు వివరాలు
టీమిండియా తొలి ఇన్నింగ్స్- 396 (యశస్వీ జైస్వాల్ 209; అండర్సన్ 3/47)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 253 (క్రాలే 76; బుమ్రా 6/45)
టీమిండియా రెండో ఇన్నింగ్స్- 255 (గిల్ 104; టామ్ హర్ట్‌లీ 4/77)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్- 292 (క్రాలే 73; బుమ్రా 3/46)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- బుమ్రా

Story first published: Monday, February 5, 2024, 15:54 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+