న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్‌పై విమర్శలు ఆపండి.. బ్యాటింగ్‌పై దృష్టిపెట్టండి.. ఇంగ్లండ్ టీమ్‌కు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ చురకలు!

India vs England: Viv Richards says India have pushed England out of comfort zone

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్‌పై విమర్శలు ఆపి, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సూచించాడు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్‌ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మొతేరా పిచ్‌పై స్పందించిన వివియన్​ రిచర్డ్స్.. ఇంగ్లండ్ జట్టుపై విమర్శలు గుప్పించాడు. స్పిన్ పిచ్‌లున్న దేశానికి వెళ్లి టర్నింట్ ట్రాక్‌లున్నాయని ఏడ్వడం ఏ మాత్రం బాగోలేదన్నాడు. నాలుగో టెస్టులోనూ ఈ తరహా పిచ్​ను తయారు చేయాలని అభిప్రాయపడ్డాడు.

సరిగ్గా ఆడకుండా..

సరిగ్గా ఆడకుండా..

'ఇటీవల భారత్​లో జరిగిన టెస్టుల గురించి నన్ను కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిపై నాకు కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడి పిచ్​ల గురించి చాలా మాటలు వినబడుతున్నాయి. ఇకనైనా వీటిని ఆపండి. ఇంగ్లండ్​ జట్టు వెళ్లిందే స్పిన్ పిచ్​లు ఉండే దేశానికి. ఆ విధంగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా తయారు కావాల్సింది మీ బ్యాట్స్​మెన్. మీరు సరిగ్గా ఆడకుండా వికెట్​ను నిందించడం సరికాదు'అని వివియన్​ రిచర్డ్స్ చురకలంటించాడు.

నేనున్నా.. స్పిన్ పిచ్‌లే..

నేనున్నా.. స్పిన్ పిచ్‌లే..

ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు​కు స్పిన్​ గురించి కొంత అవగాహన రావొచ్చని రిచర్డ్స్​ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్​లో రాణించేందుకు ఈ అనుభవం వారికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. తదుపరి టెస్టులోనూ ఇదే తరహా వికెట్​ ఉంటుందని అంచనా వేశాడు. ఆ స్థానంలో నేనున్నా.. స్పిన్​ పిచ్​నే తయారు చేస్తానని వివియన్​ స్పష్టం చేశాడు.

'ఇంగ్లండ్​ ఆటగాళ్లు.. మొదటి టెస్టుకు ముందు ఉన్నంత సౌకర్యంగా రెండు, మూడు టెస్టుల తర్వాత లేరు. వారు స్పిన్​ పిచ్​లనే అభద్రత భావంలోకి వెళ్లారు. మేం ఆడుతున్నది స్పిన్​ వికెట్​ అనే విధంగా వారు మానసికంగా సిద్ధమవ్వాలి'అని విండీస్​ క్రికెట్ దిగ్గజం సూచించాడు.

లయన్ కూడా..

లయన్ కూడా..

మొతేరా పిచ్‌పై స్పందించిన నాథన్ లయన్ కూడా ఇంగ్లండ్ జట్టును తప్పుబట్టాడు. పిచ్ బాగుందని, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని తెలిపాడు. అహ్మదాబాద్ పిచ్ క్యూరేటర్‌ను తాను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. పూర్తిగా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాట్స్‌మన్ అత్యల్ప స్కోర్‌కు ఔటైనా ఏ ఒక్కరు విమర్శించరని, అదే టర్నింగ్ ట్రాక్‌పై అలా జరిగితే మాత్రం ఏడుపు మొదలుపెడతారని అసహనం వ్యక్తం చేశాడు. 'టర్నింగ్ ట్రాక్ పై ఇంగ్లండ్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇది చాలు. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ వికెట్‌పై స్పిన్ బౌలింగ్‌ను చూడటానికి నేను రాత్రంగా మెలుకవగానే ఉన్నాను. పేస్ బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడినప్పుడు ఎవరూ మాట్లాడరు. పేస్ పిచ్‌లపై ఆడి 47, 60 పరుగులకు ఆలౌటైతే కూడా ఏమీ పట్టనట్లు ఉంటారు. పిచ్‌పై ఎవరూ ఎలాంటి విమర్శలు చేయరు. కానీ పిచ్ స్పిన్ అవడం మొదలైతే చాలు ఏడుపు మొదలుపెడతారు' అని లయన్ చాలా ఘాటుగా విమర్శించాడు.

డ్రా చేసుకున్నా..

డ్రా చేసుకున్నా..

స్పిన్నర్లకు సహకరిస్తున్న చెపాక్​, మొతేరా వికెట్లపై.. కీపింగ్​ చేయడం కష్టంగా ఉందని ఇంగ్లండ్ కీపర్​ బెన్​ ఫోక్స్​ తెలిపాడు. ఇంతకుముందేప్పుడూ ఇలాంటి పిచ్​లను చూడలేదని పేర్కొన్నాడు. తొలిరోజే ఐదో రోజులా ఉందని అభిప్రాయపడ్డాడు. మార్చి 4 నుంచి అహ్మదాబాద్​లో నరేంద్రమోదీ స్టేడియంలో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లండ్​.. నాలుగో టెస్టు గెలిచి సిరీస్​ను సమం చేయాలని భావిస్తుంది. భారత్​ చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్​ను 3-1తో చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది.

Story first published: Monday, March 1, 2021, 13:38 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X