Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ ఫీజులో కోత: ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ

హైదరాబాద్: వన్డే సిరిస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లాండ్ జట్టుకు జరిమానా విధించింది.

కటక్ వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మరొవైపు స్లో ఓవర్ రేట్‌కు కారణమైన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది.

India Vs England: Visitors penalised 10 per cent of match fees forslow over-rate in 2nd ODI

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన మ్యాచ్ రిఫరీ ఆండీ పాయ్‌క్రాప్ట్ ఇంగ్లాండ్ జట్టుకు జరిమానా విధించారు. ఐసీసీ నిబంధనల ప్లేయర్స్, ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ నిబంధనల కింద ఇంగ్లాండ్ జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+