Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఫైటర్' యువీని చూసి నేర్చుకోవాలి: సెహ్వాగ్ ఉద్వేగపూరిత ట్వీట్

హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు సెంచరీలతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో 127 బంతుల్లో 150 పరుగులు చేసిన యువరాజ్ సింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరిపై ప్రశంసలు కురిపంచారు.

India Vs England: Virender Sehwag salutes 'fighter' Yuvraj Singh

దీంతో టీమిండియా మాజీ ఆటగాడు, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'అతను (యువరాజ్) క్యాన్సర్‌ను జయించాడు. ఈ రోజు ఇంగ్లీష్‌ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని' యువీని ఉద్దేశించి సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

అంతే కాకుండా కేన్సర్‌తో పోరాడుతున్న సందర్భంలో యువరాజ్ దిగిన ఫోటోను సెహ్వాగ్ పోస్టు చేశాడు.

అంతక ముందు 'పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్‌, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని' తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+