నిలిచిన ఇంటర్నెట్: కోహ్లీ సేన ఏంచేసిందో తెలుసా?
చెన్నై: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు డిసెంబర్ 16 (శుక్రవారం) నుంచి చెన్నైలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్నారు. కాగా, రెండు రోజుల క్రితం చెన్నైలో వార్ధా తుఫాను కారణంగా ఇంటర్నెట్‌తో పాటు టెలికమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి.
కొన్ని నెట్ వర్క్‌లలో ఇంటర్నెట్ కొంత మేరకు పనిచేయగా, మరికొన్ని నెట్ వర్క్‌లు పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నెట్ కష్టాలను చెన్నైలోని టీమిండియా క్రికెటర్లు ఎదుర్కొన్నారు. ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లో నెట్‌వర్క్, వైఫై సేవల్లో అంతరాయం ఏర్పడింది.
దీంతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పుజారా, కరుణ్ నాయర్‌లు ఒక గదిలోకి చేరి వీడియా గేమ్ ఆడుతూ కనిపించారు. 'నెట్‌వర్క్, వైఫై అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లు ఒక చోట చేరి ఫిఫా ఆడుతున్నారంటూ' బీసీసీఐ తన ట్విట్టర్‌లో ఫోటో పోస్టు చేసింది.

హోటల్ గదిలో వీడియో గేమ్ ఆడుతున్న ఆటగాళ్లు
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పుజారా, కరుణ్ నాయర్‌లు ఒక గదిలోకి చేరి వీడియా గేమ్ ఆడుతూ కనిపించారు. వారి పక్కనే టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు.
ఫిఫా ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు
‘నెట్‌వర్క్, వైఫై అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లు ఒక చోట చేరి ఫిఫా ఆడుతున్నారంటూ' బీసీసీఐ తన ట్విట్టర్‌లో ఫోటో పోస్టు చేసింది.

చెన్నైలో ఐదో టెస్టు
చెన్నైలో చివరి టెస్టు షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగుతుందని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) కార్యదర్శి కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. తుఫాన్ తాకిడికి నగరం దెబ్బతిన్నా.. చెపాక్ మైదానం, పిచ్‌కు ఎలాంటి నష్టమూ జరగలేదని ఆయన తెలిపారు. ‘వార్దా తుపాను ప్రభావంతో చెపాక్ స్టేడియంలోని పిచ్, ఔట్‌ఫీల్డ్ దెబ్బతినలేదు. మైదానంలోని స్క్రీన్ పూర్తిగా దెబ్బతింది. ఫ్లడ్‌లైట్లలోని బల్బులు పేలిపోయాయి. ఎయిర్ కండిషనర్లు పాడయ్యాయి. వీటిని మరో రెండు రోజుల్లో బాగు చేయిస్తాం' అని తెలిపారు.

పిచ్, ఔట్‌ఫీల్డ్ దెబ్బతినలేదు
స్టేడియానికొచ్చే మార్గంలో వందలాది చెట్లు నేలకూలాయని చెప్పారు. రెండు రోజుల్లో వీటన్నింటిని చక్కదిద్దడం తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లతో మ్యాచ్ నిర్వహించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఏర్పాట్లు
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో డిసెంబర్ 16 నుంచి చివరి టెస్టు జరగనుంది. ముంబై టెస్టు విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంకో టస్టు మిగిలుండగానే భారత్ 3-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

చెపాక్ పిచ్‌పై నిప్పుల సెగ
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఆఖరి, ఐదో టెస్ట్ కోసం చెపాక్ మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు. పిచ్‌పై ఉన్న తేమను తగ్గించడానికి సంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఎర్రగా కాలుతున్న బొగ్గులను ఇనుప ట్రేలలో పోసి వాటి కింద స్టంప్స్‌ను ఉంచి పిచ్‌పై అటూ ఇటూ తిప్పుతున్నారు. ప్రస్తుత పిచ్ పరిస్థితిపై బీసీసీఐ సౌత్ జోన్ క్యూరేటర్ పీఆర్ విశ్వనాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వార్దా తుపాను తాకిడికి తడిసి ముద్దయిన ఈ స్టేడియం ఇప్పుడు పూర్తి సిద్ధంగా ఉందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications