ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు: కోహ్లీ సెంచరీతో నమోదైన రికార్డులివే!

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా తొలుత ప్రారంభమైన మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. అయితే, ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 1-2తో చేజార్చుకుని అభిమానులను కాసింత నిరాశకు గురి చేసింది.

దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందు.. భారత్ ఎలా రాణిస్తుందోనని అభిమానుల దృష్టంతా నిలిచింది. క్రికెట్ సమష్టి క్రీడ కావడం.. కొందరు మేటి ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే జట్టు విజయాలకు అతడి ఇన్నింగ్సే కీలకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ఆటగాళ్లో విరాట్ కోహ్లీ ఒకడు.

100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్
దీంతో ఇంగ్లీషు గడ్డపై టీమిండియా విజయం సాధించాలంటే అతడి ప్రదర్శన ఎంతో కీలకమని ప్రస్తుత, మాజీ క్రికెటర్లంతా విశ్లేషించారు. ఇందుకు కారణం గత ఇంగ్లాండ్ పర్యటనలో అతి పేలవంగా 13.40 సగటుతో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచడమే. గత ఇంగ్లాండ్ పర్యటనలో ఒత్తిడి కారణంగానే కోహ్లీ పేలవ ప్రదర్శన చేశాడు. తాజాగా, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో కూడా భారత్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లీపై తీవ్ర ఒత్తిడి పడింది.

ఒత్తిడిని దరిచేరనీయని కోహ్లీ
కానీ కోహ్లీ దానిని దరిచేరనీయలేదు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా ఏమాత్రం తత్తరపాటుకు లోనుకాలేదు. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇది కోహ్లీకి ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్ట్ సెంచరీ కాగా.. కెరీర్‌లో 22వ సెంచరీ. అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఓ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
చప్పట్లు కొడుతూ కనిపించిన అనుష్క
కోహ్లీ సెంచరీ సాధించినప్పుడు చేసుకున్న సంబరాలకైతే మ్యాచ్ చూస్తున్న వారంతా ఫిదా అయిపోయారు. మ్యాచ్ ముగించుకుని కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో మైదానంలో అభిమానులంతా లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు. మరోవైపు కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా గ్యాలరీలో నిల్చుని చప్పట్లు కొడుతూ కనిపించింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు.

తొలి టెస్టులో నమోదైన రికార్డులు
* ఇంగ్లాండ్ జట్టుపై 1000 పరుగులు చేసిన 13వ ఆటగాడిగా రికార్డు.
* ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీకి ఇది తొలి సెంచరీ. కెరీర్‌లో ఓవరాల్‌గా ఈ సెంచరీ 22వది.
* అతి తక్కువ ఇన్నింగ్స్ (113)లో 22 శతకాలు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ... సచిన్ (114)ను అధిగమించాడు.
* ఇంగ్లాండ్‌పై 1000 టెస్టు పరుగులు పూర్తి చేసిన 13వ భారత ఆటగాడు విరాట్ కోహ్లీ.
* 2011 సిరీస్ అనంతరం ఇంగ్లాండ్‌లో భారత జట్టు తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించడం ఇదే మొదటిసారి.
* అశ్విన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్‌మన్‌గా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డును అందుకున్న అలిస్టర్ కుక్.. తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్‌కు చిక్కిన ఇంగ్లండ్ ఓపెనర్. అశ్విన్ బౌలింగ్‌లో కుక్ ఔట్ కావడం ఇది తొమ్మిదోసారి.
* అతి పిన్న వయస్సు (20 ఏళ్ల 60 రోజులు)లో ఇంగ్లాండ్ తరఫున నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా శామ్ కర్రన్.
* తక్కువ టెస్టుల్లో 2500కి పైగా పరుగులు చేసి, 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా బెన్ స్టోక్స్ (43 మ్యాచ్‌ల్లో) నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications