ఫోటోలు: ఇంగ్లాండ్‌పై సరికొత్త రికార్డు సృష్టించిన భారత్
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా ప్రపంచ రికార్డుని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 759/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్‌పై అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా భారత్ నిలిచింది.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రికార్డు
అంతకుముందు 2004లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌పై 751/5 వద్ద డిక్లేర్డ్ చేయటమే అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అధిగమించింది. మరోవైపు ఈ సిరిస్‌లో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది.

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ
చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు. అంతేకాదు ఇదే మాదిరి ఒక సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం 1978-79 తర్వాత ఇదే తొలిసారి.

చివరిసారిగా వెస్టిండీస్‌పై
చివరిసారిగా సొంతగడ్డపై వెస్టిండీస్‌పై భారత్ ఆ అరుదైన ఘనతను సాధించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను సాధించారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాలుగోసారి. చెన్నై టెస్టులో నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయగా ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని రాహుల్ కోల్పోయాడు.

ఇప్పటివరకూ ఎనిమిది సెంచరీలు
అంతక ముందు ఈ సిరిస్‌లో మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది సెంచరీలను సాధించడం మరో విశేషం. ఇందులో కోహ్లి, మురళీ విజయ్‌లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్‌లు సెంచరీలు సాధించిన వారిలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications