రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్


హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూలు కోరడంలో మళ్లీ తడబడ్డాడు. ఆటలో భాగంగా మూడోరోజైన ఆదివారం భారత జట్టు 292 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటై కాగా.. అనంతరం ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.
ఇంగ్లాండ్ ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో స్వల్ప విరామంలోనే కోహ్లీ రెండు రివ్యూలను వాడేశాడు. ఈ రెండింట్లో ఏ ఒక్కటి కూడా భారత్‌కు అనుకూలంగా ఫలితం రాకపోవడంతో రెండు రివ్యూలను కోల్పోయింది. ఓవర్ వ్యవధిలో రెండు రివ్యూలను భారత్ జట్టు చేజార్చుకోవడం జట్టుని ఒత్తిడిలో పడేసింది.

జడేజా వేసిన 10వ ఓవర్ రెండో బంతికి
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా వేసిన 10వ ఓవర్ రెండో బంతి ఆ జట్టు ఓపెనర్ జెన్నింగ్స్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో వెంటనే సమీక్ష కోరిన భారత కెప్టెన్‌కు నిరాశే ఎదురైంది. బంతి ఔట్ స్టంప్స్‌కు వెళ్లినట్లు రిప్లేలో స్పష్టం అయింది. మళ్లీ 12వ ఓవర్‌లో అదే జడేజా వేసిన బంతి కుక్ ప్యాడ్లకు తాకింది. దీంతో మరోసారి కోహ్లీ రివ్యూను ఆశ్రయించాడు.

80 ఓవర్లకి ఒకసారి రెండు జట్లకీ రెండు రివ్యూలు
కానీ, ఇక్కడ కూడా కోహ్లీకి నిరాశ తప్పలేదు. టెస్టు మ్యాచ్‌లో సాధారణంగా.. 80 ఓవర్లకి ఒకసారి రెండు జట్లకీ రెండు రివ్యూలు లభిస్తాయి. అంపైర్ల నిర్ణయంపై అనుమానం ఉంటే.. ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ లేదా క్రీజులోని బ్యాట్స్‌మెన్ డీఆర్‌ఎస్ అడిగే వెసులబాటు ఉంటుంది. ఒక్కోసారి ఈ రివ్యూలు కారణంగా మ్యాచ్ ఫలితాలే సమూలంగా మారిపోతాయి.

అనాలోచితంగా వృథా చేస్తున్నాడు
అలాంటి రివ్యూలను కోహ్లీ అనాలోచితంగా వృథా చేస్తున్నాడని, ఆటగాళ్లు బిగ్గరగా అప్పీల్ చేయగానే అతను డీఆర్‌ఎస్‌కి వెళ్లిపోతున్నాడని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ మండిపడ్డాడు. తాజాగా, మూడో రోజైన ఆదివారం కూడా కోహ్లీ కోహ్లీ నిమిషాల వ్యవధిలో రెండు రివ్యూలను చేజార్చుకోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇలా
ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఓ గొప్ప బ్యాట్స్‌మెనే.. కానీ ప్రపంచంలో ఓ చెత్త సమీక్షకుడు కూడా అతడే అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వాన్ తన ట్విట్టర్‌లో "విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మన్. కానీ, నిజం చెప్పాలంటే ప్రపంచంలో చెత్త సమీక్షకుడు కూడా కోహ్లీనే" అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications