For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీశ్ పాండే ఆశలపై నీళ్లు చల్లిన రాహుల్ సెంచరీ

India vs England: Virat Kohli Impressed by KL Rahul and Kuldeep Yadavs Fearless Approach

హైదరాబాద్: టీమిండియా టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా రాణిస్తుండటం, జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ కోహ్లీకి జట్టు ఎంపిక బాగా కష్టమైంది. ఈ తరుణంలో భారత జట్టు మిడిలార్డర్‌లో రోజురోజుకీ పోటీ పెరిగిపోతోంది. దీనిపై ఆశలు పెట్టుకున్న మనీశ్ పాండే.. ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన రెండు టీ20ల సిరీస్‌లో విఫలమవడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

అంతేకాదు, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో రాహుల్‌ దూకుడును ప్రదర్శించి.. హాఫ్ సెంచరీ, సెంచరీ బాది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో.. ఇప్పట్లో మళ్లీ మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లుగానే కనిపిస్తోంది. గతేడాదికాలం భారత జట్టు మిడిలార్డర్‌‌లో రెండు స్థానాల కోసం సురేశ్ రైనా, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే‌లు పోటీపడుతున్నారు.

అయితే.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించిన సురేశ్ రైనా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. ఇక మిగిలిన ఒక స్థానం కోసం నలుగురు పోటీపడుతూవచ్చారు. తాజాగా మెరుపు ఇన్నింగ్స్‌లతో కేఎల్ రాహుల్‌ దాన్ని భర్తీ చేసేశాడు.

2019 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లోనే జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై టీమిండియా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జరుగుతున్న ఇంగ్లాండ్‌ పర్యటనలో రాణించే క్రికెటర్లకే మెగా టోర్నీలో ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి. ఒకవేళ మిడిలార్డర్‌లో ఎవరికైనా అవకాశం ఇవ్వదలుచుకున్నా.. రేసులో మనీశ్ పాండే కంటే ఇప్పుడు దినేశ్ కార్తీక్‌ ముందు వరుసలో నిలిచాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:51 [IST]
Other articles published on Jul 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+