హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య (జనవరి 29)న ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో కోహ్లి సేన ఓటమిపాలవడంతో రెండో టీ20లో చావోరేవో లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే టీ20 సిరీస్‌ను కోల్పోతుంది.
దీంతో రెండో టీ20లో జట్టులో పలు మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం బౌండరీ లైన్ 75 యాడ్స్ కావడంతో కోహ్లీ స్పిన్నర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తొలి టీ20 తుది జట్టులో దక్కించుకోని అమిత్ మిశ్రాకు రెండో టీ20లో చోటు కల్పించే అవకాశం ఉంది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలే ఇందుకు నిదర్శంగా కనిపిస్తున్నాయి. 2014 వరల్డ్ కప్ టీ20 జట్టులో అమిత్ మిశ్రా కీలకపాత్ర పోషించాడు. అయితే 2016 వరల్డ్ కప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్లు అమిత్ మిశ్రా, యుజువేంద్ర చాహల్‌తో పాటు పర్వేజ్ రసూల్‌లకు కోహ్లీ చోటు కల్పిస్తాడనే క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా భారత్‌లోని అన్ని స్టేడియాల్లో కూడా బౌండరీ లైన్ 65 యాడ్స్ వరకు ఉంటుంది. దీంతో 300కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. అయితే జమ్తాలోని విదర్భ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో మాత్రం బౌండరీ లైన్ 75 యాడ్స్ వద్ద ఉంటుంది. దీంతో స్ఫిన్నర్లు సత్తా చాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇదే విషయాన్ని ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న యువ లెగ్ స్ఫిన్నర్ యజువేంద్ర చాహల్ పేర్కొన్నాడు. హర్యానాకు చెందిన యజువేంద్ర చాహల్ శనివారం మీడియాతో మాట్లాడాడు. జమ్తాలోని వీసీఏ స్టేడియం పెద్దదిగా ఉండటం వల్ల స్పిన్నర్లకు ఆయుధమైన ఫ్లెటెడ్ డెలివరీల అస్త్రాలను రెండో ట్వంటీ 20లో ఉపయోగించని పేర్కొన్నాడు.
'పెద్ద స్టేడియాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. బంతిని మనం ఫైట్ చేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. బౌండరీ లైన్ పెద్దదిగా ఉంటే ఫ్లెటెడ్ డెలివరీలతో బ్యాట్స్‌ను ఊరించి వికెట్లు తీయొచ్చు' అని చాహల్ తెలిపాడు.